ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అగ్రగామిగా నిలిచిన ఓలా కంపెనీ ఉద్యోగులకు షాకిచ్చింది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ ఎంప్లాయిస్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 4,000 మంది ఉద్యోగులతో ఉన్న ఓలా ఎలక్ట్రిక్.. దాదాపు 500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. పునర్నిర్మాణ డ్రైవ్‌కు సిద్ధమవుతున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. అంటే 12 శాతం మంది ఉద్యోగులపై ప్రభావం చూపించనుంది. వివిధ విభాగాల్లో, వేర్వేరు స్థాయిల్లో ఉన్న వ్యక్తులకు లేఆఫ్ ప్రకటించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Darshan Case: దర్శన్‌కి బిగుసుకుంటున్న ఉచ్చు.. రేణుకాస్వామి హత్యలో కొత్త సాక్ష్యాలు..
అయితే ఈ తొలగింపు ప్రక్రియ జులై నుంచి ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. వివిధ విభాగాల్లో వివిధ స్థాయిల్లో దశలవారీగా ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని ఉద్యోగి ఒకరు తెలిపారు. డిసెంబర్ కల్లా లేఆఫ్‌ల ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న శ్రామికశక్తిని సమర్థంగా వినియోగించుకుని తద్వారా మార్జిన్లు, లాభదాయకతను పెంచుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ‘స్వర్ణాంధ్ర 2047’ డాక్యుమెంట్ రూపొందించాం..
ఇదిలా ఉంటే ఓలా ఎలక్ట్రిక్ తన స్టోర్‌లను విస్తరణ కోసం ప్రయత్నిస్తోంది. 2025, మార్చి నాటికి 2,000 స్టోర్‌లను పెంచే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ రూ. 75,000, రూ. 1,50,000 మధ్య ధర కలిగిన ఆరు మోడళ్ల విస్తృత పోర్ట్‌ఫోలియోతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అగ్రగామిగా నిలిచింది. ప్రతి త్రైమాసికంలో కనీసం ఒక లాంచ్‌తో సహా రాబోయే రెండేళ్లలో 20 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనతో కంపెనీ టూ-వీలర్, త్రీ-వీలర్ సెగ్మెంట్‌లలోకి కూడా వైవిధ్యం చూపించబోతుంది.
ఇది కూడా చదవండి: UK: కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!