Site icon NTV Telugu

NPS New Rules : ఎన్పిఎస్ సబ్‌స్క్రైబర్లకు అలెర్ట్.. రేపటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్..

Nps

Nps

ప్రతి నెల ఆర్థిక పరంగా కొన్ని మార్పులు జరుగుతాయని అందరికీ తెలుసు.. అలాగే వచ్చే నెల ఫిబ్రవరి నుంచి కొన్ని మార్పులు రానున్నాయి.. ఈ మేరకు పెన్షన్ దారులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఎన్‌పీఎస్‌ నుంచి పార్షియల్‌ విత్‌డ్రాకు అవకాశం కల్పిస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. కాగా, ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది..

మాములుగా ఎన్‌పీఎస్‌ సబ్‌స్క్రైబర్లు ఇప్పుడు ఉన్నత విద్య, వివాహం, నివాస గృహాల కొనుగోళ్లు, వైద్య ఖర్చులు వంటి ప్రయోజనాల కోసం తమ పెన్షన్‌ అమౌంట్‌ నుంచి కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.. డ్రా చేసుకొనే అమౌంట్ మొత్తం అమౌంట్ నుంచి 25 శాతం మించకూడదు. అలాగే కాంట్రిబ్యూషన్‌లపై వచ్చే రిటర్నులను పార్షియల్‌గా విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదు.. ఒకవేళ డ్రా చేసుకోవాలనుకుంటే మూడేళ్లు అయ్యి ఉండాలి..ఒక్కో సబ్‌స్క్రైబర్‌కు మూడు పార్షియల్‌ విత్‌డ్రాలకు అనుమతి ఉంటుంది. తదుపరి పార్షియల్‌ విత్‌డ్రాకు, చివరి పార్షియల్‌ విత్‌డ్రా తేదీ తర్వాత సబ్‌స్రైబర్‌ చేసిన అదనపు కాంట్రిబ్యూషన్స్ మాత్రమే అర్హత పొందుతాయి..

ఎలా డ్రా చేసుకోవాలంటే?

ఈ అమౌంట్ ను డ్రా చేసుకోవాలి అనుకొనేవారు ముందుగా సంబంధిత ప్రభుత్వ నోడల్ ఆఫీస్‌లో విత్‌డ్రా రిక్వెస్ట్‌, కారణాన్ని తెలియజేస్తూ సెల్ఫ్‌-డిక్లరేషన్‌ను సబ్మిట్‌ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్‌లు కూడా అందజేయాలి. విత్‌డ్రా రిక్వెస్ట్‌ ప్రాసెస్ చేయడానికి ముందు సబ్‌స్క్రైబర్ బ్యాంక్ అకౌంట్‌ ‘పెన్నీ డ్రాప్’ టెస్ట్‌లో సక్సెస్‌ అవ్వాలి.. అలా అయిన వారికి వెరిఫికేషన్ కూడా ఉంటుంది.. అది పూర్తి అయ్యాకే డబ్బులు అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అవుతాయి..

ఈ పార్సియల్ విత్ డ్రా వల్ల కలిగే ప్రయోజనాలు.. ఫ్లాట్ కొనుగోలు లేదా నిర్మాణం కోసం ఎన్‌పీఎస్‌ అకౌంట్‌ నుంచి పార్షియల్‌ అమౌంట్‌ విత్‌డ్రా చేసుకోవచ్చు.. అలాగే ఆరోగ్య సమస్యల విషయంలో ఆసుపత్రిలో చేరడం, చికిత్స కోసం పార్షియల్‌ విత్‌డ్రా చేసుకోవచ్చు.. స్కిల్ డెవలప్‌మెంట్‌, సెల్ఫ్‌ డెవలప్‌మెంట్‌ యాక్టివిటీల కోసం పార్షియల్‌గా అమౌంట్ విత్‌డ్రా చేసుకోవచ్చు.. ఏదైనా వ్యాపారం చెయ్యడం కోసం డిపాజిట్ చేసిన కొంత మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు..

Exit mobile version