Site icon NTV Telugu

NPAs may Increase: ‘‘రంగ రంగ వైభవంగా’’.. అనే పరిస్థితేం లేదు. కొన్ని రంగాల్లో పెరగనున్న ఎన్‌పీఏలు

Npas May Increase

Npas May Increase

NPAs may Increase: ఈ సంవత్సరం ఎంఎస్‌ఎంఈ రంగంలో ఎన్‌పీఏలు పెరిగే అవకాశం ఉందని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ మరియు ఇండస్ట్రీ అండ్‌ ది ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఎంఎస్‌ఎంఈలతోపాటు ఏవియేషన్‌, టూరిజం, హాస్పిటాలిటీ, పవర్‌, రిటైల్‌ ట్రేడ్‌ వంటి రంగాలకు కూడా ఈ ప్రమాదం ఎదురుకానుందని స్టడీలో పాల్గొన్న బ్యాంకులు పేర్కొన్నాయి. 25 బ్యాంకులు పాల్గొన్న ఈ అధ్యయనంలో ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్య కాలాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.

‘ది గ్రేట్‌’ గౌతమ్‌ అదానీ

ఇండియన్‌ బిజినెస్‌మ్యాన్‌ గౌతమ్‌ అదానీ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో మూడో స్థానానికి ఎదిగారు. ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యాపారవేత్తగా నిలిచారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ రూపొందించిన ఈ ధనవంతుల జాబితాలో మన దేశంలోని మరో దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ గానీ చైనాకు చెందిన జాక్‌ మా గానీ గతంలో ఇంత మంచి ర్యాంక్‌ సంపాదించుకోలేకపోయారు. 137 బిలియన్‌ డాలర్లకు పైగా సంపదతో గౌతమ్‌ అదానీ.. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ను దాటేశారు. ఇప్పుడు అదానీ ముందు ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌ మాత్రమే ఉన్నారు.

NTV Business ICONS Exclusive Interview: Vani Kola – Founder, Kalaari Capital

తేజాస్‌కి గ్రీన్‌సిగ్నల్‌?

దేశీయంగా తయారుచేస్తున్న తేజాస్‌ లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ని మరింత శక్తిమంతంగా రూపొందించేందుకు ఉద్దేశించిన తేజాస్‌ మార్క్‌-2 ఫైటర్‌కి కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డిజైన్‌, డెవలప్‌మెంట్‌ ప్రతిపాదనలు ఈ వారమే కేంద్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానున్నాయి. కేబినెట్‌లో చర్చించిన అనంతరం తయారీ అనుమతులతోపాటు ఆర్థికపరమైన అనుమతులు కూడా ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఈ కొత్త తేజాస్‌ మార్క్‌-2 ఫైటర్‌కి తుది రూపు ఇచ్చేందుకు రెండేళ్లు పడుతుంది. తర్వాత మరో ఏడాదికి ఫస్ట్‌ ఫ్లైట్‌ భారత రక్షణ శాఖ అమ్ములపొదిలోకి చేరుతుంది.

మారుతున్న టర్మ్స్‌

యూరప్‌లో ప్రస్తుతం తాను అమలుచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ లైసెన్సింగ్‌ అగ్రిమెంట్లకు సంబంధించిన టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌ను దశలవారీగా మారుస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్‌ అనుసరిస్తున్న విధానాలు ఈ రంగంలో నెలకొన్న తీవ్ర పోటీలో తమకు ప్రతికూలంగా మారాయంటూ కొన్ని యూరోపియన్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు కంప్లైంట్‌ చేయటంతో ఆ సంస్థ స్పందించింది. సాఫ్ట్‌వేర్‌ లైసెన్సింగ్‌ అగ్రిమెంట్లలో తాము చేస్తున్న ఈ మార్పులు చేర్పుల వల్ల ప్రత్యర్థి కంపెనీల కస్టమర్లు ఇకపై తేలిగ్గా తమ సాఫ్ట్‌వేర్‌లను ఇతర నెట్‌వర్క్‌లకు మార్చుకోవచ్చని మైక్రోసాఫ్ట్‌ వివరించింది.

బిర్లా భారీ ఇన్వెస్ట్‌మెంట్‌

తమ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అయిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 3,117 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్‌ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. ప్లాంట్ల ఆధునికీకరణ మరియు సంస్థ సామర్థ్యాన్ని పెంపొందించటం కోసం ఈ నిధులను కేటాయిస్తామని షేర్‌ హోల్డర్లతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. పెయింట్లు, బీ2బీ ఇ-కామర్స్‌ సెగ్మెంట్ల అభివృద్ధి కోసం వ్యూహాత్మక ప్రణాళికలను అమలుచేస్తామని పేర్కొన్నారు. పెయింట్ల బిజినెస్‌ కోసం కేటాయించిన 10 వేల కోట్ల మూలధన వ్యయానికి కంపెనీ బోర్డు ఇప్పటికే అనుమతి మంజూరు చేసింది.

ఆర్‌బీఐ ఫ్రాడ్‌ రిజిస్ట్రీ!

డిజిటల్‌ మోసాలకు చెక్‌ పెట్టే లక్ష్యంతో డేటాబేస్‌ని క్రియేట్‌ చేసేందుకు ఫ్రాడ్‌ రిజిస్ట్రీ ఏర్పాటు యోచనలో ఉన్నట్లు ఆర్‌బీఐ ఈడీ అనిల్‌ కుమార్‌ శర్మ వెల్లడించారు. ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడే వెబ్‌సైట్లను, ఫోన్‌ నంబర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని, తద్వారా అవి మళ్లీ ఫ్రాడ్స్‌కు పాల్పడకుండా అడ్డుకోవచ్చని అన్నారు. ఫ్రాడ్‌ రిజిస్ట్రీని ఎప్పటిలోగా ఏర్పాటుచేస్తామో చెప్పలేమని, ప్రస్తుతానికి పేమెంట్స్‌, సెటిల్‌మెంట్స్‌ మరియు సూపర్‌విజన్‌ తదితర విభాగాలతో, వాటాదారులతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు.

Exit mobile version