Site icon NTV Telugu

Nothing Phone (1): రూ.32 వేల స్మార్ట్‌ఫోన్‌.. ఇప్పుడు రూ.1,999కే మీ సొంతం..!

Nothing Phone

Nothing Phone

Nothing Phone (1): ఇది నిజమే రూ. 32 వేల విలువైన స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు కేవలం రూ. 1,999కే సొంతం చేసుకునే అవకాశం వచ్చింది.. ఈ అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్‌ కలిపిస్తోంది.. బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ నథింగ్‌ ఫోన్‌(1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నమ్మశక్యం కాని ధరకు ఆఫర్‌ పెట్టింది.. రూ. 32,999 ప్రారంభ ధరతో లాంచ్‌ అయిన నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 1,999కి అందుబాటులో ఉంచారు.. అయితే, రూ.32,999 ధర ఉన్న ఫోన్‌ను రూ.1,999కే పొందాలంటే.. ఇవి ఫాలో కావాల్సి ఉంటుంది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌8వేల తగ్గింపుతో రూ. 29,999 వద్ద నథింగ్ ఫోన్ (1) లిస్ట్‌ చేశారు.. ఇక, దీనికి అదనంగా, కొనుగోలుదారులు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌పై కొనుగోలు చేస్తే అదనంగా 10శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు.. మరోవైపు.. పాత ఫోన్‌ ఎ‍క్స్చేంజ్‌ ఆఫర్‌గా రూ. 27 వేల వరకు తగ్గింపుతో కలిపి నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,999కే పొందే అవకాశం ఉంది.

మొత్తంగా నథింగ్ ఇయర్ (2) గ్లోబల్ లాంచ్‌కు ముందు నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నమ్మశక్యం కాని ధరకు అందుబాటులో పెట్టింది.. సంస్థ నుండి వచ్చిన మొదటి ఉత్పత్తి అయిన నథింగ్ ఇయర్ (1)ని నథింగ్ ఇయర్ (2) విజయవంతం చేసింది. ఇయర్ (2) ప్రారంభానికి ముందు, నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. నథింగ్ ఫోన్ (1) కార్ల్ పీ నేతృత్వంలోని UK-ఆధారిత టెక్ స్టార్టప్ నుండి వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ మరియు ఇది దాని విభాగంలో ‘అత్యుత్తమంగా అమ్ముడవుతున్న’ ఫోన్‌గా పేర్కొంది.

ఇక, నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే.. 6.55 అంగుళాల OLED డిస్‌ప్లే దాని సొంతం.. Qualcomm Snapdragon 778G+ చిప్‌సెట్ , ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OS, 12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 50+50 డ్యుయల్‌ రియర్‌ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ ఉంది.. డిస్‌ప్లే పైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కెమెరా విషయానికి వస్తే, స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్ మరియు 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. ముందు భాగంలో, నథింగ్ ఫోన్ (1) 16MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది.

Exit mobile version