Nisha Jaiswal Success Story: కోవిడ్ మహమ్మారి ఎందరో జీవితాలను ప్రభావితం చేసింది. అలా కోవిడ్ కారణంగా ప్రభావితం అయిన వారిలో మధ్యప్రదేశ్‌లోని రేవా పట్టణంలోని నాకా ప్రాంతంలో నివసించే నిషా ఒకరు. లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఉద్యోగాలు కోల్పోతున్న సమయంలో నిషా బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో ఆమె ఉద్యోగం కోసం వేచి ఎదురుచూడకుండా, కోవిడ్ సమయంలోనే తనే నలుగురికి ఉపాధిని ఇచ్చేలా ఒక స్టార్టప్‌ను ప్రారంభించింది. ఇంతకి ఆమె స్థాపించిన స్టార్టప్ ఏంటి, అసలు ఆమె సక్సెస్ స్టోరీ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: AP Weather Alert: ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్..
ఆవు పేడతో అలంకరణ ఉత్పత్తులు..
నిషా తండ్రి పంచాయతీ కార్యదర్శి, ఆమె తల్లి గృహిణి. ఆమెకు ఒక అక్క, చార్టర్డ్ అకౌంటెంట్ అయిన సోదరుడు ఉన్నారు. నిషా రేవాలోని సెంట్రల్ అకాడమీ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తర్వాత ఆమె బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధం కావడం ప్రారంభించింది. కరెక్ట్‌గా అదే సమయానికి కోవిడ్ మహమ్మారి కారణంగా ఆమె తన చదువును మధ్యలో వదిలేసింది. ఇక దేని కోసం ఎదురుచూడకుండా తానే ఒక స్టార్టప్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. చిన్నప్పటి నుంచి తనకు, తన కుటుంబానికి ఆవులంటే చాలా అభిమానం అని నిషా తెలిపింది. ఆమె కుటుంబ సభ్యులు కొందరు చాలా కాలంగా ఆవులను పెంచుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఆమెకు తన సొంత వెంచర్‌ను ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. ఆవు పేడతో అగరుబత్తులు తయారు చేయాలనే ఆలోచన చేసినట్లు నిషా పేర్కొంది. తన ఆలోచన రూపం దాల్చడానికి తన అన్నయ్య రూ.4 లక్షలు ఇచ్చి స్టార్టప్ ప్రారంభించడానికి సహాయం చేశాడంది.
తన స్టార్టప్ ప్రారంభించిన కొత్తలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ వాటిని చూసి కుంగిపోలేదని చెప్పింది. అగరుబత్తుల అమ్మకం కొత్తలో వ్యాపారులకు తన అగరుబత్తులను ఇచ్చి వారి దుకాణాలలో నిల్వ చేయమని కోరేదని తెలిపింది. ఒకసారి నెలల పాటు ఉచితంగా అగరుబత్తులు ఇచ్చిందని పేర్కొంది.
ఇక్కడి నుంచే సక్సెస్..
వ్యాపారులకు ఉచితంగా అగరుత్తులు ఇవ్వడం అనే నిషా మార్కెట్ ప్లాన్ సక్సెస్ అయ్యింది. చివరికి వినియోగదారుల నుంచి అగరుబత్తులకు మంచి స్పందన లభించింది. ఆమె ఉత్పత్తి న్యాణమైనదని, గుర్తించిన ప్రజలు ఆమె విజయంలో కీ రోల్ ప్లే చేశారు. క్రమక్రమంగా మార్కెట్లో ఆమె అగరుబత్తులకు డిమాండ్ పెరగడంతో, నిషా క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించింది. ఆమె అగరుబత్తులను పెద్ద మొత్తంలో తయారు చేయడానికి ఒక ఆటోమేటిక్ యంత్రాన్ని కొనుగోలు చేసింది. ఈక్రమంలో ఆమె తన స్టార్టప్‌లో కొంతమంది స్థానికులకు ఉపాధి కల్పించింది. ప్రతి సంవత్సరం ఆమె దాదాపు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నట్లు, ఇప్పటి వరకు తన స్టార్టప్ రూ.5 నుంచి రూ.6 లక్షల లాభం సంపాదించిందని చెప్పారు. ఆవు పేడతో తయారు చేసిన సువాసన గల ధూపం కర్రలకు నిషా పేటెంట్ పొందింది. ఆమె తన బ్రాండ్‌కు ‘సాత్విక్’ అని పేరు పెట్టింది. తన తయారు చేసే ప్రాడక్ట్స్ పర్యావరణ అనుకూలంగా ఉంటాయని తెలిపింది. సాత్విక్ బ్రాండ్ వస్తువులు గులాబీ, లావెండర్, గుగ్గల్, పైనాపిల్, గంధపు చెక్క వంటి వివిధ సువాసనలలో లభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది భారతీయ రైల్వేల ‘వన్ స్టేషన్, వన్ ప్రొడక్ట్’ పథకంలో కూడా ఎంపికైంది. ఈ పథకం కింద ఈ ఉత్పత్తులు రేవా రైల్వే స్టేషన్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఇవే కాకుండా ఆమె ఇల్లు, కార్యాలయ అలంకరణ కోసం ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నట్లు తెలిపారు. దీపావళి సందర్భంగా ఇళ్లను అలంకరించడానికి ఆవు పేడతో తయారు చేసిన ఆకర్షణీయమైన దియాలను, పర్యావరణ అనుకూల రాఖీలతో సహా అనేక ఉత్పత్తులను తయారు ఆమె చేస్తున్నారు. నిషా తన ఉత్పత్తులను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ వాణిజ్య వేదికలలో త్వరలో విక్రయించాలని చూస్తున్నట్లు తెలిపారు. నిషా ప్రస్థానం ఎందరో యువతులకు ప్రేరణగా నిలుస్తుంది.
READ MORE: Sai Durga Tej : తెలుగులో స్టైలిష్ హీరో అతనే.. సాయిదుర్గ తేజ్ కామెంట్స్
