NTV Telugu Site icon

Stock market: రుచించని ఆర్బీఐ పాలసీ.. నష్టాల్లో ముగిసిన సూచీలు

Stockmarket

Stockmarket

గురువారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు ప్రకటించింది. రెపో రేటు వరుసగా తొమ్మిదోసారి యథాతథంగా ఉంచింది. అయినా కూడా దేశీయ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బుధవారం భారీ లాభాలతో ప్రారంభమై.. చివరిదాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. అదే ఒరవడి ఆర్బీఐ పాలసీ తర్వాత ఉంటుందని భావించారు. కానీ అందుకు భిన్నంగా భారీ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 581 పాయింట్లు నష్టాపోయి 78, 886 దగ్గర ముగియగా.. నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయి 24, 117 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83.95 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది.

ఇది కూడా చదవండి: Antim Panghal: అక్రిడిటేషన్ రద్దు గురించి అంతిమ్ పంఘల్ ఏం చెప్పిందంటే..?

నిఫ్టీలో ఎల్‌టీఐఎండ్‌ట్రీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ కార్ప్, ఇన్ఫోసిస్ ప్రధాన నష్టాల్లో ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సిప్లా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. సెక్టోరల్‌లో ఫార్మా, హెల్త్‌కేర్, మీడియా మినహా మిగిలిన అన్ని సూచీలు మెటల్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో 1-2 శాతం క్షీణించాయి.

ఇది కూడా చదవండి: Bomb Making: యూట్యూబ్‌ చూసి బాంబులు తయారు చేసిన పిల్లలు..చివరకి.?

Show comments