Site icon NTV Telugu

OTTplay Premium: ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో 12 ఓటీటీలు

Ott Play Premium

Ott Play Premium

ఓటీటీ అంటే ఓవర్‌ ది టాప్ అని అర్ధం. లాక్‌డౌన్ పుణ్యమా అంటూ ఓటీటీలకు భారీగా డిమాండ్ పెరిగింది. స్మార్ట్ టీవీల రాక కూడా ఓటీటీలకు ప్లస్ పాయింట్‌గా మారింది. దీంతో ఓటీటీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే అన్ని ఓటీటీలకు సపరేట్‌గా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలంటే సామాన్యుడికి భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లే ప్రీమియం బంపర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో 12 ఓటీటీల కంటెంట్‌ వీక్షించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వీటిలో సోనీ లివ్‌, జీ5, లయన్స్‌గేట్ ప్లే, సన్‌ నెక్ట్స్‌, షెమారూమీ, క్యూరియాసిటీ స్ట్రీమ్‌, షార్ట్స్‌టీవీ, డాక్యుమే వంటి ఓటీటీలు ఉన్నాయి.

12 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ ఒక్కొక్కటిగా తీసుకుంటే ఎంత అవుతుందో అందులో కేవలం నాలుగో వంతు చెల్లిస్తే చాలు అని ఓటీటీ ప్లే ప్రీమియం వెల్లడించింది. ఒకే ప్లాట్‌ఫామ్‌పై 25 వేలకుపైగా సినిమాలు, వెబ్‌షోలు అందించడం మన దేశంలో ఇదే తొలిసారి అని తెలిపింది. ఓటీటీల్లో స్థానిక భాషల కంటెంట్‌ను యూజర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తాము గమనించామని ఓటీటీప్లే ప్రీమియం కో ఫౌండర్‌ అవినాష్‌ పేర్కొన్నారు. ఓటీటీప్లే ప్రీమియంలో మొత్తం ఐదు రకాల సబ్‌స్క్రిప్షన్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువలో తక్కువగా నెలకు రూ.50 సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఉంది. కాగా ఓటీటీప్లే ప్రీమియం లాంచింగ్‌ ఈవెంట్‌లో సోనాక్షి సిన్హా, పంకజ్‌ త్రిపాఠీ, ప్రతీక్‌ గాంధీ, రసికా దుగల్‌, బొమన్‌ ఇరానీ, ఇంతియాజ్‌ అలీ, వివేక్‌ వాస్వానీ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

Netflix : గేమర్స్‌ సిద్ధంకండి.. కొత్త గేమ్‌లను ప్రకటించిన నెట్‌ప్లిక్స్‌..

Exit mobile version