NTV Telugu Site icon

ఎంజీ నుంచి స‌రికొత్త ఎల‌క్ట్రిక్ కార్‌…ధ‌ర ఎంతంటే…

ఇండియాలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న‌ది. టూవీల‌ర్స్‌తో పాటు, కార్లు కూడా ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. టాటా నెక్సాన్ ఇప్ప‌టికే ఎల‌క్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే విధంగా కార్ల‌ను త‌యారు చేసింది. కాగా, ఎంజీ మోటార్స్ సంస్థ కూడా ఎల‌క్ట్రిక్ కార్ల‌ను త‌యారు చేస్తున్న‌ది. కొన్ని మోడ‌ల్స్ ఇండియాలో ఇప్ప‌టికే లాంచ్ చేశారు. ఎంజీ జెడ్ఎస్ ఈవీ కారును త్వ‌ర‌లోనే ఇండియాలో లాంచ్ చేయ‌బోతున్న‌ది. ఐదు మోడ‌ళ్ల‌లో ఈవీ కారును లాంచ్ చేయ‌బోతున్నారు. ఈ కారు ముందు భాగంలో అనేక మార్పులు చేశారు. చూసేందుకు ఇది ఆస్టిన్ మోడ‌ల్‌లా క‌నిపిస్తుంద‌ని నిపుణులు చెబ‌తున్నారు. ఇక ఈ ఎల‌క్ట్రిక్ కారు ధ‌ర రూ. 28 ల‌క్ష‌ల నుంచి రూ. 35 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. కొత్త ఈవీ చార్జింగ్ బ్యాట‌రీతో గంట వ్య‌వ‌ధిలోనే 80 శాతం చార్జింగ్ చేసుకోవ‌చ్చ‌ని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Read: క‌ర్నూలు జిల్లాలో దారుణం: పెళ్లిబాజాల‌కు భ‌య‌ప‌డి ప‌రుగులు తీసిన ఎద్దులు…