Site icon NTV Telugu

Myntra Tweet: మింత్రా చీప్ పబ్లిసిటీ స్టంట్.. కేఎల్ రాహుల్‌పై సెటైరికల్ ట్వీట్

Kl Rahul

Kl Rahul

Myntra Tweet: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. పసికూనలపై రెండు హాఫ్ సెంచరీలు మినహా బలమైన జట్లపై చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ముఖ్యంగా సెమీస్ లాంటి మ్యాచ్‌లోనూ కేఎల్ రాహుల్ నిరాశపరిచాడు. దీంతో అతడి వైఫల్యంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ను అనవసరంగా జట్టులోకి తీసుకున్నారని, అతడి ఆటకంటే బిల్డప్ ఎక్కువగా ఉంటుందని మండిపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ ట్రోలింగ్‌ను ఓ కంపెనీ తనకు ప్రమోషన్‌గా ఉపయోగించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ మింత్రా టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌పై వ్యంగ్యంగా ట్వీట్ చేసి అతడి అభిమానుల ఆగ్రహానికి గురైంది. తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఇంత చీప్‌గా వ్యవహరించడం సరికాదని చీవాట్లు పెడుతున్నారు. ఇంతకీ మింత్రా సంస్థ చేసిన ట్వీట్‌లో ఏముందంటే.. ‘అవుట్ ఆఫ్ ది వరల్డ్’ అని ప్రింట్‌ చేసిన టీ-షర్టులో కేవలం ‘అవుట్’ మాత్రం కనిపంచేలా ఉన్న టీ షర్ట్‌ ఫోటోను షేర్‌ చేసింది. ఈ పోస్ట్‌కు ‘కేఎల్‌ రాహుల్ ఇష్టమైన టీ-షర్ట్’ అంటూ సెటైరికల్‌గా క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో మింత్రా చేసని పనికి సోషల్‌మీడియాలో కేఎల్‌ రాహుల్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్స్‌ ఆపాలంటూ మండిపడుతున్నారు. అయితే ఈ టీషర్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో కాసేపటికే మింత్రా ఈ ట్వీట్‌ను డిలీట్ చేసింది. అయితే అప్పటికే చాలా మంది స్క్రీన్ షాట్లు తీసి వైరల్ చేయడంతో మింత్రాను నెటిజన్‌లు ఆడుకుంటున్నారు.

Exit mobile version