Mukesh Ambani: గత 6 ఏళ్లుగా జీతం తీసుకోని ముఖేష్ అంబానీ.. అయినా సంపదలో రికార్డులు

  • ఆసియాలో రెండవ అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ
  • గత 6 ఏళ్లుగా జీతం తీసుకోని ముఖేష్ అంబానీ
  • ముఖేష్ అంబానీ సంపదకు ప్రధాన కారణం జీతం కాదు
Mukesh Ambani

Mukesh Ambani

ఆసియాలో రెండవ అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ గత ఆరు సంవత్సరాలుగా జీతం తీసుకోకపోయినా, సంపద మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఏర్పడిన ఆర్థిక, సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ నుంచి జీతం, అలవెన్సులు, బోనస్‌లు, పదవీ విరమణ ప్రయోజనాలు, స్టాక్ ఆప్షన్లు వంటి ఎలాంటి పారితోషికాన్ని కూడా స్వీకరించలేదు. ఇదే సమయంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.95,754 కోట్లకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ముఖేష్ అంబానీ జీతం ఎంత ఉండేది?

×
×
Ad

ముఖేష్ అంబానీ గత ఆరు సంవత్సరాలుగా జీతం తీసుకోకపోయినా, అంతకుముందు వార్షిక జీతం రూ.15 కోట్లుగా ఉండేది. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచే తన జీతాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. ఆ తర్వాత రిలయన్స్ వ్యాపారం, లాభాలు భారీగా పెరిగినా కూడా అదే జీత పరిమితిని దాదాపు 12 సంవత్సరాల పాటు కొనసాగించారు.

జీతం తీసుకోకపోతే సంపాదన ఎలా?

ముఖేష్ అంబానీ సంపదకు ప్రధాన కారణం జీతం కాదు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కుటుంబానికి ఉన్న భారీ వాటానే ఆస్తుల పెరుగుదలకు ప్రధాన ఆధారం. కంపెనీ షేర్ ధర పెరిగే కొద్దీ నికర సంపద కూడా పెరుగుతుంది. అంతేకాదు, ప్రధాన ఆదాయ వనరు డివిడెండ్లు.

కంపెనీ లాభాల్లో భాగంగా వాటాదారులకు డివిడెండ్ చెల్లిస్తుంది. రిలయన్స్‌లో ముఖేష్ అంబానీకి సుమారు 16.1 మిలియన్ షేర్లు ఉన్నట్లు సమాచారం. FY2025లో కంపెనీ ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్ ప్రకటించడంతో ఆయనకు సుమారు రూ.96.6 మిలియన్ల ఆదాయం వచ్చినట్లు అంచనా. అయితే, ఆదాయం (Income), నికర ఆస్తి విలువ (Net Worth) రెండూ వేర్వేరు అంశాలని గుర్తుంచుకోవాలి.

లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రిలయన్స్

Reliance Industries దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రముఖ సంస్థగా ఎదిగింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటి. గత ఏడాది రిలయన్స్ సంస్థ లక్ష మందికి పైగా కొత్త ఉద్యోగాలను కల్పించింది. దీంతో 2026 మార్చి 31 నాటికి సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,19,911కు చేరుకుంది. ఇక జామ్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ ద్వారా మరో రూ.2 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా వేస్తున్నారు.