Site icon NTV Telugu

స్టాక్‌ మార్కెట్లో ఐపీఓల సందడి

నవంబర్‌లో లిస్టింగ్‌కు రానున్న ఏడు కంపెనీలు
నవంబర్‌ నెలలో స్టాక్‌ మార్కెట్లో సందడి నెలకొననుంది. ఇప్పటికే పలు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకురాగా, తాజాగా మరికొన్ని కంపెనీలు రానున్నాయి. మొత్తంగా స్టాక్‌ మార్కెట్లో ఏడుకు పైగా కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు రానున్నాయి. వీటి విలువ దాదాపు రూ.27000 కోట్లకు పైగా ఉండనుంది. నవంబర్‌లో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే కంపెనీల్లో పేటీం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌, పాలసీ బజార్‌ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్‌ ప్రథమార్థంలోనే లిస్టింగ్‌ అవ్వనున్నాయి.

వీటితో పాటు కేఎఫ్‌సీ, పిజ్జాహట్‌ అవుట్‌ లెట్లను నిర్వహించే సఫైర్‌పుడ్స్‌ ఇండియా, ఎస్‌జేఎస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, మైక్రో క్రిస్టలైన్‌ సెల్యూలోజ్‌ తయారీ సంస్థ సిగాచీ ఇండస్ట్రీస్‌ ఇష్యూకు రానున్నాయి. ఇప్పటికే ఈ- టెయిలర్‌నైకా, ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌ సేల్‌ మొదలు పెట్టాయి. నవంబర్‌1న నైకా, 2న ఫినో సబ్‌స్ర్కిప్షన్‌ సేల్స్‌ ముగుస్తాయి. నైకా రూ.5,352 కోట్లు, ఫినోబ్యాంక్‌ రూ.1200 కోట్ల విలువతో ఐపీవోకు రానున్నాయి.

నవంబర్‌లో లిస్ట్‌ అవుతున్న ఏడు కంపెనీల ఐపీఓ విలువ రూ.33.500 కోట్లుగా ఉంది. 2021లో ఇప్పటి వరకు 41 కంపెనీలు మార్కెట్లో నమోదు అయ్యాయి. రూ.66,915కోట్లు సమీకరించాయి. ఈ ఏడాది ఐపీఓ విలువ రూ. లక్ష కోట్లకు చేరుకుంటుందని స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version