Site icon NTV Telugu

Money Tips : నెలకు రూ.1000 కడితే చాలు..రూ.2 కోట్లు మీ సొంతం..

money tips

money tips

డబ్బులు సంపాదించాలనే ఆశ అందరికి ఉంటుంది.. అయితే ఒక్కొక్కరు ఒక్కోదారిని వెతుక్కుంటారు.. అందులో కొంతమంది పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు.. అయితే కోసం అదిరే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అందుబాటులో ఉంది. రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. కానీ భారీ రాబడి పొందే ఛాన్స్ కూడా ఉంటుంది. అందువల్ల మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే.. ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు ఉంటే.. వారు స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌ను ఎంచుకోవచ్చు. అప్పుడు రిస్క్ ఉండదు. రాబడి తక్కువగా ఉంటుంది..

ఈ మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువ మంది డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు.. మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే భారీ రాబడి పొందొచ్చని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు పేర్కొంటూ ఉంటారు. అందువల్ల మీరు కూడా ఎక్కువ టెన్యూర్‌తో డబ్బులు దాచుకుంటే అధిక రాబడి పొదొచ్చు. సిప్ ఆప్షన్‌లో నెలకు కొంత మొత్తం చెల్లిస్తూ వెలితే దీర్ఘకాంలోల ఒకేసారి భారీ మొత్తం పొందొచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్‌లో సగటున 12 శాతం రాబడి అందిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల భారీ రిటర్న్ సొంతం చేసుకోవచ్చు. అయితే మీరు ఎంచుకునే ఫండ్ ఆధారంగా మీకు వచ్చే రాబడి మారుతుంది. అలాగే టెన్యూర్ ఆధారంగా కూడా రాబడిలో మార్పు ఉంటుంది.

సాదారణంగా స్టాక్ మార్కెట్ ఆధారంగానే మ్యూచువల్ ఫండ్స్ రాబడి ఉంటుంది.. ఇది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.. మార్కెట్ పడిపోతే ఫండ్స్ ఎన్ఏవీ కూడా పడుతుంది. అప్పుడు రాబడి పడిపోతుంది. కొన్ని సార్లు నష్టాలు కూడా రావొచ్చు.. అందుకే ఏదైనా జాగ్రత్తగా చేసుకోవడం మంచిది.. ఉదాహరణకు మీరు నెలకు .1000 పెట్టాలని అనుకుంటే.. ఇలా 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్ట్‌మెంట్లను కొనసాగించాలి. ఇప్పుడు సిప్ క్యాలిక్యులేటర్ ప్రకారం చూస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ.2 కోట్ల 33 లక్షలు లభిస్తాయి. ఇక్కడ వార్షిక రాబడిని 20 శాతంగా పరిగణలోకి తీసుకున్నాం. మీ ఫండ్ పని తీరు తగ్గితే అప్పుడు రాబడి కూడా తగ్గుతుంది.. అందుకే ఈ విషయాన్ని పరిశీలిస్తూ ఉండాలి.. అయితే, మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాలని భావించే వారు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. భారీ రిస్క్ ఉంటుంది. అందు వల్ల డబ్బులు పెట్టడానికి ముందే ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు సలహా తీసుకోండి. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. భారీగా నష్టపోవాల్సి ఉంటుంది.. అనుభవం ఉన్నవాళ్ళు మాత్రమే ఫండ్స్ లో ఇన్వెస్ట్ చెయ్యడం మంచిది..

Exit mobile version