NTV Telugu Site icon

Meesho: మీషో ఉద్యోగులకు భారీ ఆఫర్.. రెస్ట్ కోసం 9 రోజులు సెలవులు

Meesho

Meesho

దేశంలో ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తోంది. వినాయక చవితి ముగిసింది. ప్రస్తుతం దసరా నవరాత్రులు నడుస్తున్నాయి. అనంతరం దీపావళి పండుగ రానుంది. ఇలాంటి పెద్ద ఫెస్టివల్స్ సమయంలో కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం పెద్ద గగనమే. అలాంటిది తమ ఉద్యోగుల శ్రేయస్సు కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మీషో బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ ఉద్యోగుల విశ్రాంతి కోసం ఏకంగా తొమ్మిది రోజులు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. తమ సిబ్బంది రెస్ట్‌ తీసుకొని రీఛార్జ్‌ అయ్యేందుకు ఈ సెలవులు ఇస్తున్నట్లు ఈ సంస్థ తెలిపింది. వరుసగా నాలుగో ఏడాది ఈ తరహా బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పింది.

ఇది కూడా చదవండి: Bangalore: దుకాణదారుడి భార్య ఖాతాలోకి హఠాత్తుగా రూ.999 కోట్లు.. తర్వాత ఏం జరిగింది?

9 రోజుల పాటు ల్యాప్‌టాప్స్‌ ఉండవు. ఈ మెయిల్స్ రావు. స్టాండప్‌ కాల్స్‌ ఉండవు. ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి పని ఉండదు అని సంస్థ తెలిపింది. ఈ ‘రెస్ట్‌ అండ్ రీఛార్జ్’ బ్రేక్ అక్టోబర్ 26 నుంచి నవంబర్ మూడు వరకు ఉండనుంది. కొత్త ఏడాదికి సరికొత్త శక్తిని కూడదీసుకునేందుకే ఈ బ్రేక్‌ అని మీషో సంస్థ వెల్లడించింది. ఇది చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఈ విధానం ఎంతో సంతోషాన్నిస్తోందంటూ ప్రశంసించారు. సిబ్బంది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంత విలువ ఇస్తున్నారో దీనిని బట్టి తెలుస్తోందని కామెంట్లు పెట్టారు.

ఇది కూడా చదవండి: Nobel Prize: సాహిత్యంలో హాన్ కాంగ్‌‌కు నోబెల్ బహుమతి

Show comments