Mark Zuckerberg: ఫేస్‌బుక్‌ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్‌బర్గ్‌కు డిగ్రీ లేదు తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mark Zuckerberg: టెక్ దిగ్గజం మెటా తన వ్యూహాలను పూర్తిగా మార్చేస్తోంది. ఏఐ, మెటావర్స్ రంగాల్లో ఆధిపత్యం సాధించేందుకు సుమారు 135 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టాలని జుకర్‌బర్గ్ నిర్ణయించారు. అయితే ఈ ఖర్చును బ్యాలెన్స్ చేసేందుకు కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం కోత విధించబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రేసులో గెలవడానికి మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. భవిష్యత్తు టెక్నాలజీ కోసం ఏకంగా రూ.11 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడిని ప్రకటించిన ఆయన, మరోవైపు కంపెనీలో భారీగా ఉద్యోగాల కోతకు తెరలేపారు.
లేఆఫ్స్ లెక్క ఇదీ..
సుమారు 8,000 మంది ఉద్యోగులను మెటా నేరుగా తొలగించనుంది. ఇదే సమయంలో గతంలో ఖాళీగా ఉన్న మరో 6,000 పోస్టులను ఎప్పటికీ భర్తీ చేయకూడదని నిర్ణయించారు. మొత్తంగా 14,000 కొలువులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
డ్రాపౌట్ టు టెక్ కింగ్.. జుకర్‌బర్గ్ ప్రస్థానం ఇదే
ఒక్క నిర్ణయంతో వేల మంది అర్హత గల ఇంజినీర్లను రోడ్డున పడేస్తున్న జుకర్‌బర్గ్ చదువు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎంతో మంది ఇంజినీర్ల భవిష్యత్తును శాసిస్తున్న ఆయన విద్యా ప్రయాణం ఒక సినిమాను తలపిస్తుంది. స్కూల్ రోజుల్లోనే జుకర్‌బర్గ్ ఖగోళశాస్త్రం, గణితం, భౌతికశాస్త్రంలో అద్భుత ప్రతిభ చూపి ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. లాటిన్, గ్రీక్ భాషల్లో డిప్లొమా కూడా చేశారు. ప్రపంచంలోనే నంబర్ 1 యూనివర్సిటీ అయిన హార్వర్డ్‌లో కంప్యూటర్ సైన్స్, సైకాలజీ చదువుతూ.. రెండో ఏడాదిలోనే ‘ఫేస్‌బుక్’ క్రేజ్ చూసి చదువు మధ్యలోనే ఆపేశారు. అందుకే ఆయనను ‘కాలేజీ డ్రాపౌట్’ అని పిలుస్తారు. చదువు మానేసిన 12 ఏళ్ల తర్వాత, 2017లో అదే హార్వర్డ్ యూనివర్సిటీ జుకర్‌బర్గ్‌ను ఆహ్వానించి ‘డాక్టర్ ఆఫ్ లాస్’ గౌరవ పట్టాతో సత్కరించింది.
ఫేస్‌బుక్ ప్రస్థానం..
2004 ఫిబ్రవరి 4న “ది ఫేస్‌బుక్” పేరుతో ప్రారంభించి, 2005లో “ఫేస్‌బుక్”గా మార్చారు. కంపెనీ కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, వర్చువల్ రియాలిటీ (VR) వంటి రంగాల్లో విస్తరించాక, మాతృ సంస్థ పేరును ‘మెటా’ (Meta)గా మార్చారు. మెటా అనేది ఒక పేరెంట్ కంపెనీ. దీని కింద మనం నిత్యం వాడే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్, థ్రెడ్స్ వంటి దిగ్గజ ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!