సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో మరో బ్రాండ్ వచ్చి చేరింది. టాలీవుడ్ లో కార్పోరేట్ బ్రాండ్ లకు కేరాఫ్ ఆడ్రెస్ గా మారిన మహేశ్ తాజాగా ప్రముఖ మొబైల్ కంపెనీ బిగ్ సి కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో దాదాపు 250 కి పైగా స్టోర్లను కలిగిన మొబైల్ ఫోన్ రిటైల్ చైన్ బిగ్ సికి ప్రచారం మొదలెట్టాడు మహేశ్. ఇప్పటికే పలు పెద్ద పెద్ద బ్రాండ్ల కు ప్రచార కర్తగా ఉన్న మహేశ్ ఈ ఎండార్స్ మెంట్స్ లో తనకు పోటీ లేదని నిరూపించాడు. హైదరాబాద్ లో ఏషియన్ సినిమాస్ తో కలసి ఎ.ఎం.బి సినిమాస్ నిర్మించిన మహేశ్ ఆ తర్వాత సొంత దుస్తుల కంపెనీ హంబల్ ను కూడా మొదలెట్టాడు. గతంలో పలువురు తారలు ప్రచారం చేసిన బిగ్ సి కి ఇప్పుడు మహేశ్ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నాడు. ఇక మహేశ్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ తోను, రాజమౌళితోనూ సినిమాలు చేయబోతున్నాడు మహేశ్.
బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్ గా మహేశ్ బాబు
