Site icon NTV Telugu

Magicpin – Rapido: రాపిడోతో చేతులు కలిపిన మ్యాజిక్‌పిన్.. జొమాటో, స్విగ్గీల ఆధిపత్యానికి తెర పడుతుందా?

Magicpin Rapido

Magicpin Rapido

Magicpin – Rapido: దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ మ్యాజిక్‌పిన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో జొమాటో, స్విగ్గీల ఆధిపత్యాన్ని అధిగమించేందుకు రాపిడోతో చేతులు కలిపినట్లు మ్యాజిక్‌పిన్ వెల్లడించింది. ఫుడ్‌ డెలివరీ మార్కెట్‌లో మూడో అతిపెద్ద యాప్‌ అయిన మ్యాజిక్‌పిన్‌ తన రెస్టారంట్‌ నెట్‌వర్క్‌ను రాపిడో యాజమాన్యంలోని ‘ఓన్‌లీ (Ownly)’ ప్లాట్‌ఫాంతో అనుసంధానం చేయననుంది. ఆగస్టులో బెంగళూరులో ప్రారంభమైన ఓన్‌లీని ఇతర నగరాలకు విస్తరించే ప్రయత్నాలలో భాగంగానే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

READ ALSO: Mana Shankara Varaprasad Garu : అనిల్ రావిపూడి బర్త్ డే స్పెషల్.. చిరు సందడి చూశారా

ఈ సందర్భంగా రాపిడో ప్రతినిధి మాట్లాడుతూ.. “మా మర్చంట్ టీమ్‌ద్వారా రెస్టారెంట్లను నేరుగా ఆన్‌బోర్డ్‌ చేసుకోవడమే రాపిడో ప్రధాన విధానం. కొన్ని నగరాల్లో మాజిక్‌పిన్‌తో లాజిస్టిక్స్ పార్ట్నర్లుగా కూడా కలిసి పనిచేస్తున్నాము. మా కెప్టెన్ ఫ్లీట్ చివరి దశ డెలివరీలను నిర్వహిస్తుంది. వ్యాపారుల కోసం నమ్మకమైన, చవకైన, డెలివరీ పరిష్కారాలను అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు. మ్యాజిక్‌పిన్ – రాపిడో చేతులు కలపడంతో ఈ రంగంలో సరికొత్త పోటీ నెలకొనే ఛాన్స్ ఉందనే అవకాశమం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్నేళ్లుగా సంపాదించుకున్న విశ్వసనీయత, వేగం ఆధారంగా ఈ రంగంలో జొమాటో, స్విగ్గీలు బలమైన పునాది వేసుకున్నాయి. ఇప్పుడు మార్కెట్‌లో కొత్తగా ఉద్భవించిన ఈ పొత్తు జొమాటో, స్విగ్గీల ఆధిపత్యానికి గండి కొట్టడం అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: KL Rahul: వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్..

Exit mobile version