mAadhaar app: ఎమ్-ఆధార్ యాప్‌కు గుడ్‌బై.. నేటి నుంచి పాత యాప్ సేవలు నిలిపివేత.. కొత్త Aadhaar యాప్‌లో అదిరే ఫీచర్లు
- ఎమ్-ఆధార్ యాప్‌కు గుడ్‌బై
- కొత్త Aadhaar యాప్‌లో అదిరే ఫీచర్లు
- కొత్త Aadhaar యాప్‌లో "One Family – One App" ఫీచర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధార్ కార్డును మొబైల్లో ఉపయోగించే కోట్లాది మంది వినియోగదారులకు కీలక అప్డేట్ వచ్చింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) పాత mAadhaar యాప్ సేవలను జూన్ 30, 2026 నుంచి అధికారికంగా నిలిపివేసింది. ఇకపై పాత యాప్ పనిచేయదు. దాని స్థానంలో మరింత ఆధునిక ఫీచర్లు, మెరుగైన భద్రతతో కూడిన కొత్త Aadhaar యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
పాత డేటా ఆటోమేటిక్‌గా కొత్త యాప్‌లోకి వస్తుందా?
కొత్త యాప్ విడుదలతో చాలామందిలో ఉన్న ప్రధాన సందేహం ఇదే. అయితే UIDAI స్పష్టంగా తెలిపిన ప్రకారం, పాత mAadhaar యాప్‌లోని డేటా కొత్త Aadhaar యాప్‌కు ఆటోమేటిక్‌గా బదిలీ కాదు. అంటే కొత్త యాప్‌ను డౌన్లోడ్ చేసిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తో మళ్లీ లాగిన్ అయి ఆధార్ ప్రొఫైల్‌ను తిరిగి నమోదు చేసుకోవాలి. కొత్త ప్రొఫైల్ సక్సెస్‌ఫుల్‌గా సెటప్ అయిన తర్వాత పాత mAadhaar యాప్‌ను ఫోన్ నుంచి తొలగించవచ్చు.
Also Read
- Elon Musk: అమెరికా పిల్లలకు మస్క్ ఫ్రీ ఆఫర్.. స్పేస్ఎక్స్ షేర్లు ఉచితం!
- Amazon Layoffs: అమెజాన్‌లో మళ్లీ లే ఆఫ్స్.. డెలివరీ విభాగంలో భారీగా కోతలు..
- Nirmala Sitharaman: స్టాక్ మార్కెట్లో లాభాలు తగ్గడానికి కారణం ఇదే.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
- DA Hike: ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?
కొత్త Aadhaar యాప్‌లో “One Family – One App” ఫీచర్
కొత్త యాప్‌లోని ప్రధాన ఆకర్షణ “One Family – One App” సదుపాయం. దీని ద్వారా ఒకే స్మార్ట్‌ఫోన్‌లో ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యుల వరకు ఆధార్ ప్రొఫైల్‌లను నిర్వహించుకోవచ్చు. దీంతో కుటుంబ సభ్యులందరికీ వేర్వేరు ఫోన్లు అవసరం ఉండదు.
కొత్త Aadhaar యాప్‌లోని ముఖ్యమైన ఫీచర్లు
UIDAI కొత్త యాప్‌ను మరింత సురక్షితంగా, వేగవంతంగా, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టానికి అనుగుణంగా రూపొందించింది.
1. ఇంటి నుంచే చిరునామా, మొబైల్ నంబర్ అప్డేట్
ఇకపై ఆధార్‌లో చిరునామా లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మార్చుకోవడానికి కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. యాప్ ద్వారానే ఈ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
2. బయోమెట్రిక్ లాక్ / అన్‌లాక్
వేలిముద్రల దుర్వినియోగాన్ని నివారించేందుకు ఒకే క్లిక్‌తో బయోమెట్రిక్ వివరాలను లాక్ లేదా అన్‌లాక్ చేసుకునే సదుపాయం కల్పించారు.
3. ప్రైవసీతో QR కోడ్ షేరింగ్
హోటల్, సినిమా లేదా ఇతర చోట్ల ఆధార్ వివరాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, పూర్తి ఆధార్ నంబర్‌ను చూపకుండా అవసరమైన వివరాలు మాత్రమే కనిపించే ప్రత్యేక QR కోడ్‌ను యాప్ రూపొందిస్తుంది. దీంతో వ్యక్తిగత సమాచారం మరింత భద్రంగా ఉంటుంది.
4. ఫేస్ ఆథెంటికేషన్
వేలిముద్రలతో పాటు ముఖాన్ని ఉపయోగించి కూడా గుర్తింపును ధృవీకరించుకునే అవకాశం కొత్త యాప్‌లో అందుబాటులో ఉంది.
5. వెరిఫికేషన్ హిస్టరీ
మీ ఆధార్ ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించారో యాప్‌లోనే చూసుకునే సౌకర్యం కూడా కల్పించారు.
ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు?
UIDAI ప్రకారం, ఈ డిజిటల్ ఆధార్ చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రంగా పనిచేస్తుంది. దీన్ని కింది సందర్భాల్లో ఉపయోగించవచ్చు.
హోటళ్లలో చెక్-ఇన్ సమయంలో
సినిమా హాళ్లలో వయస్సు ధృవీకరణకు
ఆసుపత్రుల్లో సందర్శకుల నమోదు కోసం
గిగ్ వర్కర్లు, డెలివరీ పార్ట్నర్లు వంటి వారి గుర్తింపు ధృవీకరణకు
ఇతర డిజిటల్ KYC అవసరాల కోసం
వెంటనే కొత్త యాప్‌కు మారండి
మీరు ఇప్పటికీ పాత mAadhaar యాప్‌ను ఉపయోగిస్తుంటే, వెంటనే Google Play Store లేదా Apple App Store నుంచి కొత్త Aadhaar Appను డౌన్లోడ్ చేసి, మీ ఆధార్ ప్రొఫైల్‌ను మళ్లీ సెటప్ చేసుకోవాలని UIDAI సూచిస్తోంది. కొత్త యాప్‌తో మెరుగైన భద్రత, అధునాతన ఫీచర్లు, సులభమైన వినియోగ అనుభవం పొందవచ్చు.
- Tags
- aadhaar
- mAadhaar app
- uidai
తాజావార్తలు
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..