NTV Telugu Site icon

L&T Chairman: ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలి.. దీపికా పదుకొణె షాకింగ్ రియాక్షన్

Land T

Land T

L&T Chairman: ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలి.. అలాగే, ఆదివారాలు సైతం ఆఫీసులకి వెళ్లాలని ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎల్‌అండ్‌టీ ఉద్యోగులతో ఇటీవల ఆన్‌లైన్‌లో సుబ్రహ్మణ్యన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంస్థలో వారానికి ఆరు రోజుల పని విధానాన్ని అమలు చేయడాన్ని ఓ ఎంప్లాయ్ క్వశ్చన్ చేయగా.. దీనికి ఆ కంపెనీ ఛైర్మన్ సమాధానంగా.. ఆదివారాలు కూడా మీతో పని చేయించలేకపోతున్నందుకు నేను చాలా బాధపడుతున్నా.. సండేస్ కూడా మీతో పని చేయిస్తే అప్పుడు చాలా సంతోష పడతానంటూ పేర్కొన్నాడు. ఎందుకంటే, నేను ఆదివారాలు పని చేస్తున్నాను అని ఎల్‌అండ్‌టీ చీఫ్ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ వెల్లడించారు.

Read Also: Shikhar Dhawan: నాన్నా నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. వీడియో వైరల్!

అలాగే, ఎంత సేపు ఇంట్లో కూర్చుంటావు? ఎంతసేపు నీ భార్యను చూస్తూ ఉండగలవు?.. ఆఫీసుకు వెళ్లి పని చేయూ అని ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ తెలిపారు. అంతటితో ఆగిపోలేదు.. వారానికి 90 గంటలు పని చేయాలని సైతం పేర్కొన్నాడు. తాను ఒక చైనా వ్యక్తితో మాట్లాడినప్పుడు.. డ్రాగన్ కంట్రీ కార్మికులు వారానికి 90 గంటల పాటు పని చేస్తారని, అమెరికన్లు 50 గంటలే పని చేస్తారు కావునా.. కొన్ని రోజుల్లో యూఎస్ ను చైనా దాటేస్తుందని ఆ వ్యక్తి చెప్పినట్టు సుబ్రహ్మణ్యన్‌ వెల్లడించారు. మీరు కూడా ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే వారానికి 90 గంటల పాటు పని చేయాల్సిందే అన్నారు.

Read Also: Game Changer: గేమ్ చేంజర్ సినిమాలో 18 మంది హీరోలు.. ఎవరో తెలుసా?

ఇక, ఎల్‌అండ్‌టీ చైర్మన్‌పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలను చిన్న చూపు చూసేలా మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పెద్ద తప్పు.. ఉద్యోగుల శ్రేయస్సును గురించే ఆలోచించే వ్యవక్తిత్వం ఆయనకు లేదని పేర్కొనింది.

Show comments