Site icon NTV Telugu

LPG Gas: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై మరో బిగ్ అప్‌డేట్..

Lpg Gas Cyliner

Lpg Gas Cyliner

దేశంలో వంటగ్యాస్ (LPG) సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తూ, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ పంపిణీ సజావుగా సాగుతోందని స్పష్టం చేసింది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం గ్యాస్ బుకింగ్ ప్రక్రియలో భారీ మార్పులు వచ్చాయి. సుమారు 96 శాతం బుకింగ్‌లు ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుండటంతో పారదర్శకత పెరిగింది. వినియోగదారుల భద్రత , సరైన డెలివరీ కోసం వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) విధానాన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది.

వాణిజ్య రంగంలో కూడా ఎల్పీజీ వాడకం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 5 కిలోల చిన్న సిలిండర్లకు సామాన్యుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే లక్షకు పైగా చిన్న సిలిండర్లు అమ్ముడవుతున్నాయంటే వీటి అవసరం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్చి నెల చివరి వారం నుంచి ఇప్పటివరకు సుమారు 7.8 లక్షల సిలిండర్లు అమ్ముడయ్యాయి. ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాల వల్ల వినియోగదారులు సురక్షితమైన, సులభంగా లభించే ఈ చిన్న సిలిండర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

Also Read:Train Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

మరోవైపు.. ఇంధన రంగంలో ఆధునిక మార్పులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వేలాది మంది వినియోగదారులు సంప్రదాయ సిలిండర్ల నుంచి పైపుల ద్వారా వచ్చే గ్యాస్ కనెక్షన్లకు మారడం గమనార్హం. ఇది వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా ఖర్చును కూడా తగ్గిస్తుంది. వీటితో పాటు పర్యావరణ హితమైన ‘కాంప్రెస్డ్ బయోగ్యాస్’ (CBG) వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, విధానాలను అమలు చేస్తోంది. రాష్ట్రాలకు అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులను ఈ బయోగ్యాస్ వినియోగంతో ముడిపెట్టడం ద్వారా దేశీయ ఇంధన వనరులను పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం మీద.. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

Exit mobile version