NTV Telugu Site icon

Loans Write Off: 10 లక్షల కోట్ల రూపాయల లోన్లు రద్దు. కేంద్ర ప్రభుత్వం వెల్లడి

Loans Write Off

Loans Write Off

Loans Write Off: గడచిన ఐదేళ్లలో బ్యాంకులు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల లోన్లను టెక్నికల్‌గా రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. గత నాలుగేళ్లలో 10 వేల 306 మంది ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కె.కరాడ్‌ రాతపూర్వకంగా తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో లోన్లు చెల్లించకుండా తప్పించుకున్న 25 సంస్థల పేర్లను ప్రకటించారు.

ఢిల్లీ, ముంబై ఫస్ట్‌

5జీ స్పెక్ట్రం వేలంలో అతిపెద్ద బిడ్డర్‌గా నిలిచిన రిలయెన్స్‌ జియో ఈ సేవలను జనవరి నాటికి 9 నగరాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఆర్థిక రాజధాని ముంబైల్లో మాత్రం కొంచెం ఆలస్యంగానైనా ఈ ఏడాదే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చే సిటీల జాబితాలో చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, జామ్‌నగర్‌ అహ్మదాబాద్‌, లక్నో కూడా ఉన్నాయి.

Interesting News: ఆసక్తికరమైన వార్త. ఏక్‌నాథ్‌ షిండేను చూస్తుంటే ఎవరో గుర్తొస్తున్నారు. ఆయనే..

పామాయిల్‌పై ఫోకస్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్‌ సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. వచ్చే నాలుగేళ్లలో అదనంగా 20 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా 19 బిలియన్‌ డాలర్ల విలువైన పామాయిల్‌ దిగుమతులను తగ్గించనుంది. ఈ మేరకు సాగు నీటి సౌకర్యాలను అందుబాటులోకి తేనుంది. భారీఎత్తున డ్యామ్‌లు, కాలువల నిర్మాణం చేపట్టనుంది. మొలకెత్తిన విత్తనాలను దిగుమతి చేసుకోనుంది.

పాన్‌ కార్డ్‌ మస్ట్‌

క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టేవారికి పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్‌ను తప్పనిసరి చేయాలని ఆదాయపు పన్ను విభాగం భావిస్తోంది. క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ల నుంచి లావాదేవీల స్టేట్‌మెంట్లను కూడా కోరాలనుకుంటోంది. స్టాక్‌ మార్కెట్లలో ట్రాన్సాక్షన్లు చేసేవారికి డీమ్యాట్‌ అకౌంట్‌ రూల్స్‌ అమలుచేస్తున్నట్లుగానే క్రిప్టో ఇన్వెస్టర్లకూ కఠిన నిబంధనలను ప్రవేశపెట్టనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇక 10 కోట్లే

ఇప్పటివరకు వార్షిక టర్నోవర్‌ 20 కోట్ల రూపాయలున్న కంపెనీలే ఎలక్ట్రానిక్‌ ఇన్వాయిస్‌లను జారీ చేయాల్సి ఉండగా.. ఇకపై 10 కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉన్న సంస్థలు కూడా ఇ-ఇన్వాయిస్‌లను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ పరిమితిని తగ్గిస్తూ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ను వెలువరించిన సంగతి తెలిసిందే.

1 శాతం డౌన్‌

అంతర్జాతీయంగా చమురు ధరలు దాదాపు ఒక శాతం పడిపోయాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ప్రారంభ దశలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో అంతకుముందు సెషన్‌లో వచ్చిన లాభాలకు బ్రేక్‌ పడింది. ఒపెక్‌ ప్లస్‌ ప్రొడ్యూజర్ల సమావేశానికి ముందే ఆయిల్‌ రేట్లు తగ్గటం గమనించాల్సిన విషయం. ప్రపంచ వృద్ధి మందగమన భయాలే దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.