ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఆటో మొబైల్ కంపెనీలన్నీ ఈవీలను రూపొందిస్తున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లేటెస్ట్ ఫీచర్లతో ఈవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కూడా పెరిగిపోయింది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా కంపెనీలు లేటెస్ట్ మోడళ్లను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి రాబోతోంది. ఫ్రెంచ్ కంపెనీ లిజియర్ భారత మార్కెట్ లో మినీ ఎలక్ట్రిక్ కార్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. చౌక ధరలోనే ఈ కారును తీసుకురానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రూ . లక్షకే అందించనున్నట్లు సమాచారం.
బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కారును తీసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని లిజియర్ కంపెనీ మినీ ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతున్నది. యూరోపియన్ మోడల్ ఆధారంగా ఈ 2 సీటర్ మినీ ఈవీని విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో తీసుకువస్తున్నారు. ఈ కారు సింగిల్ ఛార్జ్ తో 192 కిమీల దూరం వరకు ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. సొంత కారు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించొచ్చు.
లిజియర్ మినీ ఈవీ G.OOD, I.DEAL, E.PIC, R.EBEL అనే వేరియంట్‌లలో రానున్నట్లు తెలుస్తోంది. మూడు బ్యాటరీ ఆప్షన్స్ ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో 4.14 kWh, 8.2 kWh, 12.42 kWh ఉంటాయి. చిన్న పరిమాణంలో ఉండనున్నది. ఈ ఈవీలో కేవలం రెండు డోర్లు మాత్రమే ఉండనున్నాయి. 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ , పవర్ స్టీరింగ్ , ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన హీటెడ్ డ్రైవర్ సీట్, కార్నర్ AC వెంట్ వంటి ఫీచర్లను ఇందులో చూడవచ్చు .