Ligier Mini EV: రూ. లక్ష ధరతో ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్‌తో 192KM రేంజ్!
- రూ. లక్ష ధరతో ఎలక్ట్రిక్ కారు
- త్వరలో భారత మార్కెట్ లోకి లిజియర్ మినీ ఎలక్ట్రిక్ కార్
- సింగిల్ ఛార్జ్‌తో 192KM రేంజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఆటో మొబైల్ కంపెనీలన్నీ ఈవీలను రూపొందిస్తున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లేటెస్ట్ ఫీచర్లతో ఈవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కూడా పెరిగిపోయింది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా కంపెనీలు లేటెస్ట్ మోడళ్లను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి రాబోతోంది. ఫ్రెంచ్ కంపెనీ లిజియర్ భారత మార్కెట్ లో మినీ ఎలక్ట్రిక్ కార్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. చౌక ధరలోనే ఈ కారును తీసుకురానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రూ . లక్షకే అందించనున్నట్లు సమాచారం.
బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కారును తీసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని లిజియర్ కంపెనీ మినీ ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతున్నది. యూరోపియన్ మోడల్ ఆధారంగా ఈ 2 సీటర్ మినీ ఈవీని విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో తీసుకువస్తున్నారు. ఈ కారు సింగిల్ ఛార్జ్ తో 192 కిమీల దూరం వరకు ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. సొంత కారు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించొచ్చు.
Also Read
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
- Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
లిజియర్ మినీ ఈవీ G.OOD, I.DEAL, E.PIC, R.EBEL అనే వేరియంట్‌లలో రానున్నట్లు తెలుస్తోంది. మూడు బ్యాటరీ ఆప్షన్స్ ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో 4.14 kWh, 8.2 kWh, 12.42 kWh ఉంటాయి. చిన్న పరిమాణంలో ఉండనున్నది. ఈ ఈవీలో కేవలం రెండు డోర్లు మాత్రమే ఉండనున్నాయి. 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ , పవర్ స్టీరింగ్ , ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన హీటెడ్ డ్రైవర్ సీట్, కార్నర్ AC వెంట్ వంటి ఫీచర్లను ఇందులో చూడవచ్చు .
తాజావార్తలు
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
-
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
-
Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!