NTV Telugu Site icon

LIC Super Plan : ఎల్ఐసీ సూపర్ ప్లాన్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు..రూ. లక్ష పెన్షన్..

Licc

Licc

ప్రముఖ బీమా ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ.. ప్రజలకు అధిక రాబడి ఇచ్చే పెన్షన్ పథకాలను అందిస్తుంది. పెన్షన్ పథకాలకు డిమాండ్ పెరుగుతోంది. అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టి.. నెలవారీ లేదా.. వార్షిక పెన్షన్ పొందాలనుకునే పథకాల కోసం ఎక్కువ మంది వెతుకుతున్నారు.. ఇందులో కూడా అదిరిపోయే ప్లాన్ ఒకటి ఉంది.. అదే ఎల్ఐసీ జీవన్ శాంతి. ఇది యాన్యుటీ ప్లాన్. దీనిలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి.. జీవిత కాలం మొత్తంలో వాయిదాల పద్ధతిలో తిరిగి పొందొచ్చు.. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

ఈ ఎల్‌ఐసీ పాలసీకి 30 నుంచి 79 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంటుంది. ఇది ఎలాంటి రిస్క్ కవర్‌ను అందించదు. అయినప్పటికీ దాని ప్రయోజనాలు చాలా ఆసక్తిని కలుగజేస్తాయి. ఈ ఎల్ఐసీ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి కంపెనీ అందించిన రెండు ఎంపికలు ఉన్నాయి. మొదటి ఎంపిక సింగిల్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ, రెండవది జాయింట్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ.. ఈ ప్లాన్ ను మీ కోసం తీసుకోవచ్చు.. అలాగే మీ కుటుంబంలో మరొకరికి కూడా తీసుకోవచ్చు..

మీరు ఎంత పెట్టుబడి పెడితే అంతగా లాభాలను పొందవచ్చు.. ఉదాహరణకు ఓ 55 ఏళ్ల వ్యక్తి రూ. 11 లక్షలు పెట్టుబడి పెట్టి, దానిని ఐదేళ్ల పాటు ఉంచుకుంటే, వారు ఏటా రూ. 1,01,880 సంపాదించవచ్చు. ప్రతి ఆరు నెలలకు పెన్షన్ మొత్తం 49,911 రూపాయలు, నెలవారీ ప్రాతిపదికన, ఇది 8,149 రూపాయలు ఉంటుంది. యాన్యుటీ ప్లాన్‌లో డెత్ బెనిఫిట్‌తో వస్తాయి.. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే నామినీకి డబ్బులను చెల్లిస్తారు.. ఆర్ధిక భరోసా ఉంటుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు..