Site icon NTV Telugu

LIC Scheme: అదిరిపోయే స్కీమ్.. నెలకు రూ.10,000 సులువుగా పొందవచ్చు..

Lic Schemes

Lic Schemes

డబ్బులను పొదుపు చెయ్యడం చాలా ఉత్తమం.. మార్కెట్ లో ఎన్నో పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి.. అందులో ఎల్ఐసి అందిస్తున్న పథకాలకు మంచి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది..ప్రతి నెల డబ్బులను పొందే పథకాలు కూడా ఎన్నో ఉన్నాయి.. ఇలా ప్రతి నెల డబ్బులను పొందాలని అనుకొనేవారికి గుడ్ న్యూస్..చాలా అప్షన్లు ఉన్నాయి.. అందులో ఎల్ఐసీ పాలసీ కూడా ఒకటి ఉంది. ఇందులో చేరితే నెల నెలా క్రమం తప్పకుండా డబ్బులు పొందొచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ పాలసి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎల్ఐసీ జీవన్ శాంతి పేరుతో అదిరే పాలసీ అందిస్తోంది. ఇది పెన్షన్ ప్లాన్. ఈ పాలసీ కేవలం కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది. అంటే 30 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరడానికి అవకాశం ఉంటుంది.. ఈ స్కీమ్ లో ప్రతి నెల డబ్బులను పొందవచ్చు..పాలసీదారుడు మరణిస్తే.. బీమా డబ్బులు కూడా చెల్లిస్తారు. నామినీకి ఈ మొత్తం అందుతుంది. ఇలా ప్రతి నెలా పెన్షన్‌తో పాటు ఒకేసారి భారీ మొత్తం పొందొచ్చు.. ఇక ఇందులో కనీసం రూ.1.5 లక్షల పథకాన్ని కొనుగోలు చెయ్యొచ్చు..గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు. ఎంత మొత్తానికి అయినా పాలసీ తీసుకోవచ్చు.

నెలకు రూ.1000 నుంచి రూ. 12 వేల వరకు పొందొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా పెన్షన్ కూడా మారుతుంది.. ఉదాహరణకు మీరు రూ.10 లక్షలు పెట్టి ఈ పాలసీలో చేరారని అనుకుంటే.. ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో మనం తెలుసుకుందాం.. వయస్సు ప్రీమీయం ను బట్టి డబ్బులు కూడా మారతాయి అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి.. అంటే.. వయసు 35 ఏళ్లు. ఇప్పుడు మీరు డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్ ఎంచుకుంటే.. నెలకు రూ. 11,192 వరకు వస్తాయి. అదే డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్ ఎంచుకుంటే నెలకు రూ. 10.576 లను పొందవచ్చు..

Exit mobile version