Site icon NTV Telugu

LIC Reports Record Profit: పెరిగిన ప్రీమియం వసూళ్లు.. రూ.10,987 కోట్ల లాభంతో ఎల్ఐసీ రికార్డు

Lic

Lic

LIC Reports Record Profit: లైఫ్ ఇన్‌స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నయా రికార్డు సృష్టించింది. తాజాగా ఎల్‌ఐసీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్టాండలోన్‌ ప్రాతిపదికన 5 శాతం వృద్ధితో రూ.10,987 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది ₹ 10,544 కోట్లుగా ఉంది. వ్యక్తిగత, బిజినెస్‌ ప్రీమియంల పెరుగుదల కారణంగా ప్రీమియం వసూళ్లు పెరిగినట్లు పేర్కొంది. సమీక్షా త్రైమాసికంలో నికర ప్రీమియంల ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.1.19 లక్షల కోట్లుగా నమోదైందని తెలిపింది. ఇది గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 4.7 శాతం ఎక్కువ.

READ MORE: CM Revanth Reddy: కేసీఆర్ అరెస్ట్‌పై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్‌.. ఎంత పెద్ద మాట అన్నారు సార్…!

63.51 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానం..
ఐఆర్‌డీఏఐ డేటా ప్రకారం.. తొలి ప్రీమియం వసూళ్లలో ఎల్‌ఐసీ 63.51 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎల్‌ఐసీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సమీక్షా త్రైమాసికంలో వ్యక్తిగత ప్రీమియం ఆదాయం 6 శాతం వృద్ధి చెంది రూ.71,474 కోట్లుగా నమోదైంది. గ్రూప్‌ ప్రీమియం ఆదాయం 2.46 శాతం పెరిగి రూ.47,726 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. ఈసారి 30.39 లక్షల పాలసీలను విక్రయించింది. క్యూ1లో కొత్త పాలసీల విక్రయాలు గతేడాదితో పోలిస్తే 14.75 శాతం క్షీణించాయి. ఎల్‌ఐసీ తీసుకొచ్చిన బీమా సఖి యోజన కింద జూన్‌ 30 నాటికి 1.99 లక్షల మంది మహిళా ఏజెంట్లను నియమించినట్టు ఎల్‌ఐసీ ఎండీ, సీఈఓ దొరైస్వామి వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు విలువ స్వల్పంగా క్షీణించి రూ.886 వద్ద ముగిసింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికం నాటికి ఎల్‌ఐసీ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ మొత్తం 6 శాతం వృద్ధితో రూ.57.05 లక్షల కోట్లకు చేరింది.

READ MORE: Harassment: అసలు వీడు మనిషేనా.. యువతి ముందు ప్యాంట్ జిప్ తీసి..

Exit mobile version