LIC Reports Record Profit: పెరిగిన ప్రీమియం వసూళ్లు.. రూ.10,987 కోట్ల లాభంతో ఎల్ఐసీ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LIC Reports Record Profit: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నయా రికార్డు సృష్టించింది. తాజాగా ఎల్ఐసీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపదికన 5 శాతం వృద్ధితో రూ.10,987 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది ₹ 10,544 కోట్లుగా ఉంది. వ్యక్తిగత, బిజినెస్ ప్రీమియంల పెరుగుదల కారణంగా ప్రీమియం వసూళ్లు పెరిగినట్లు పేర్కొంది. సమీక్షా త్రైమాసికంలో నికర ప్రీమియంల ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.1.19 లక్షల కోట్లుగా నమోదైందని తెలిపింది. ఇది గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 4.7 శాతం ఎక్కువ.
READ MORE: CM Revanth Reddy: కేసీఆర్ అరెస్ట్‌పై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎంత పెద్ద మాట అన్నారు సార్…!
Also Read
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
- LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
63.51 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానం..
ఐఆర్డీఏఐ డేటా ప్రకారం.. తొలి ప్రీమియం వసూళ్లలో ఎల్ఐసీ 63.51 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎల్ఐసీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సమీక్షా త్రైమాసికంలో వ్యక్తిగత ప్రీమియం ఆదాయం 6 శాతం వృద్ధి చెంది రూ.71,474 కోట్లుగా నమోదైంది. గ్రూప్ ప్రీమియం ఆదాయం 2.46 శాతం పెరిగి రూ.47,726 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. ఈసారి 30.39 లక్షల పాలసీలను విక్రయించింది. క్యూ1లో కొత్త పాలసీల విక్రయాలు గతేడాదితో పోలిస్తే 14.75 శాతం క్షీణించాయి. ఎల్ఐసీ తీసుకొచ్చిన బీమా సఖి యోజన కింద జూన్ 30 నాటికి 1.99 లక్షల మంది మహిళా ఏజెంట్లను నియమించినట్టు ఎల్ఐసీ ఎండీ, సీఈఓ దొరైస్వామి వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఎల్ఐసీ షేరు విలువ స్వల్పంగా క్షీణించి రూ.886 వద్ద ముగిసింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికం నాటికి ఎల్ఐసీ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ మొత్తం 6 శాతం వృద్ధితో రూ.57.05 లక్షల కోట్లకు చేరింది.
READ MORE: Harassment: అసలు వీడు మనిషేనా.. యువతి ముందు ప్యాంట్ జిప్ తీసి..
తాజావార్తలు
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
ట్రెండింగ్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!