NTV Telugu Site icon

LIC Policy: ఆడపిల్లల కోసం అదిరిపోయే పాలసీ.. రోజుకు రూ.150 పొదుపుతో రూ.31 లక్షలు పొందవచ్చు..

Lics New Plan For A Happy Future For Girls

Lics New Plan For A Happy Future For Girls

దేశంలోనే అతి పెద్ద భీమా సంస్థ ఎల్ఐసీ ప్రజల కోసం ఎన్నో పథకాలను అందిస్తుంది.. ముఖ్యంగా మహిళల కోసం ఆడపిల్లల కోసం ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి.. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారి పెళ్లి గురించి నిత్యం తల్లిదండ్రులు ఆలోచిస్తూనే ఉంటారు. పెరిగిన ధరల వల్ల అమ్మాయి పెళ్లి ఏ విధంగా చేయాలని దిగులు చెందుతుంటారు. ఇలాంటి వారికోసం ఎల్​ఐసీ ఒక సూపర్​ ప్లాన్​ ప్రవేశపెట్టింది. అదే ఎల్​ఐసీ కన్యాదాన్​ పాలసీ . ఇందులో నెలకు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం వల్ల ఆమె పెళ్లి నాటికి లక్షల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.. ఈ పాలసీ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

ఈ పాలసీని తీసుకోవాలంటే మీరు కనీసం 30 ఏళ్లు ఉండాలి. మీ బిడ్డకు కనీసం 1 సంవత్సరం వయస్సు ఉండాలి. ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ 25 సంవత్సరాలు అయినప్పటికీ మీరు 22 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 3 ఏళ్లు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు.. అమ్మాయి వయస్సును బట్టి మెచ్యూరిటీ సమయం ను పెట్టుకోవచ్చు..

ఈ పాలసీని తీసుకోవాలని అనుకొనేవారికి జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, బ్యాంక్ పాస్ బుక్ ఉండాలి. ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీని తీసుకోవడానికి మీరు సమీపంలోని ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సందర్శించవచ్చు.. పాలసీలో రోజుకు రూ.151 చెల్లించాలి అంటే నెలకు రూ.4530 పొదుపు చేయాలి. 22 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత 25 ఏళ్లు పూర్తయిన తర్వాత రూ.31 లక్షలు పొందుతారు. అమ్మాయి భవిష్యత్ కోసం ఇది సరిపోతుంది.. అంతేకాదు కన్యాదాన్ పాలసీలో రోజుకు రూ.121 డిపాజిట్ చేస్తే అప్పుడు 27 లక్షల రూపాయలు వస్తాయి.. ఇంకా ఎన్నో ఉన్నాయి.. మీకు ఈ పాలసీ నచ్చితే ఇప్పుడే తీసుకోండి..