పన్ను ఎగవేతకు పాల్పడిన అంశంలో దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు ఊరట లభించింది. కర్ణాటక ప్రభుత్వం కంపెనీకి పంపిన రూ.32,403 కోట్ల నోటీసును ఉపసంహరించుకుంది. ఈ సమాచారాన్ని టెక్ దిగ్గజం గురువారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పంచుకుంది. బుధవారం నోటీసు జారీ చేసిన తర్వాత గురువారం స్వయంగా కంపెనీ ఓ వివరణ జారీ చేసింది.
READ MORE: Viva Harsha Divorce: విడాకులు తీసుకున్న కమెడియన్ హర్ష.. అసలు నిజం ఇదే..
కంపెనీ గురువారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో, కర్ణాటక రాష్ట్ర అధికారుల నుంచి కంపెనీకి సందేశం అందిందని తెలిపింది. అందులో తమకు పంపిన షో నోటీసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. కంపెనీకి జీఎస్టీ డిమాండ్ నోటీసు జారీ అనంతరం దీనిపై సమాధానం ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) కోరింది. వివరణ అనంతరం కంపెనీకి ఊరట లభించింది.
READ MORE:Himachal : హిమాచల్‌లో క్లౌడ్ బరస్ట్.. నలుగురు మృతి, 49 మంది గల్లంతు
కాగా.. డీజీజీఐ పంపిణ నోటీలో జులై 2017 నుంచి 2021-2022 వరకు పన్ను ఎగవేసినట్లు పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ తన విదేశీ శాఖల నుంచి సేవలను పొందిందని, అయితే వాటిపై రూ.32,403 కోట్ల పన్ను చెల్లించలేదని డీజీజీఐ ఆరోపణలు చేసింది. ఇన్ఫోసిస్ సేవల దిగుమతిపై IGSTని చెల్లించనందుకు విచారణలో ఉందని పన్ను పత్రం పేర్కొంది. దీనిపై కంపెనీ సమాధానం చెప్పింది.
READ MORE: Paris Olympic 2024 : నేడు మరోసారి బరిలో మను భాకర్.. మూడో పతకం సాధించేనా?
ఈ నోటీసును ప్రీ-షో కాజ్ నోటీసుగా పేర్కొంటూ కంపెనీ ఈ వివరణ ఇచ్చింది. అటువంటి ఖర్చులపై జీఎస్టీ వర్తించదని వివరణ ఇచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. భారతీయ సంస్థకు విదేశీ శాఖలు అందించే సేవలు జీఎస్టీకి లోబడి ఉండవని ఇన్ఫోసిస్ తెలిపింది. జీఎస్టీ చెల్లింపు అనేది ఐటీ సేవల ఎగుమతికి వ్యతిరేకంగా క్రెడిట్ లేదా వాపసు కోసమని చెప్పింది. జీఎస్టీ బకాయిలన్నీ చెల్లించామని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నామని కంపెనీ తెలిపింది.