Jio Annual Plan: జియో వార్షిక ప్లాన్‌తో అదిరిపోయే ఆఫర్.. అన్‌లిమిటెడ్ 5జీతో పాటు AI, OTT సబ్‌స్క్రిప్షన్లు ఉచితం

Reliance Jio

Reliance Jio

Jio Annual Plan: నెలనెలా రీఛార్జ్ చేసే ఇబ్బందికి చెక్ పెట్టేలా రిలయన్స్ జియో రూ.3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2.5GB హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఏడాది మొత్తం 912GBకుపైగా డేటా వినియోగించే అవకాశం ఉంటుంది. 5జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో, అనుకూల స్మార్ట్‌ఫోన్ ఉంటే అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా పొందవచ్చు.

ఈ ప్లాన్‌లో డేటా, కాలింగ్‌తో పాటు పలు డిజిటల్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మూడు నెలల పాటు JioHotstar Mobile + Hollywood యాక్సెస్, 50GB Jio AI Cloud స్టోరేజ్, అదనపు చార్జీ లేకుండా 18 నెలల Google Gemini Pro సబ్‌స్క్రిప్షన్‌ను జియో అందిస్తోంది. దీంతో వినోదంతో పాటు ఏఐ ఆధారిత సేవలను కూడా వినియోగించుకోవచ్చు.

ఇక రూ.3,999 ప్లాన్‌లో మరిన్ని డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి. తక్కువ ధరలో దీర్ఘకాలిక ప్లాన్ కోరుకునేవారికి రూ.3,336 ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది. ప్రధానంగా కాలింగ్ అవసరాలున్న వారికి రూ.2,025 ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. అధిక డేటా వినియోగించే వారు, ఓటీటీ సేవలు, 5జీ, ఏఐ ఫీచర్లు కోరుకునే వారికి రూ.3,599 ప్లాన్ ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది.