Site icon NTV Telugu

న్యూ ఇయర్‌కు జియో బంపరాఫర్.. అప్పటి వరకే అవకాశం..

అన్ని ఫ్రీ అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టి.. తక్కువ కాలంలోనే కోట్లాది మంది కస్టమర్లను ఆకట్టుకున్న రిలయన్స్ జియో.. తన యూజర్లకు కొత్త సంవత్సరం కానుకగా బంపరాఫర్ తీసుకొచ్చింది.. ప్రీపెయిడ్‌ ప్లాన్ల చార్జీల పెంపు తర్వాత కొంత ఊరట కల్పించే విషయం చెప్పింది జియో.. ఇక, జియో న్యూఇయర్ ఆఫర్‌ను పరిశీలిస్తే.. రూ.2,545 వార్షిక ప్లాన్‌పై కొత్త సంవత్సరం సందర్భంగా ఆఫర్ తీసుకొచ్చింది.. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే.. ఇప్పటి వరకు 336 రోజుల వ్యాలిడిటీ ఉండగా… ఇప్పుడు కొత్త ఆఫర్ కింద 29 రోజుల అదనపు వ్యాలిడిటీ అందిస్తోంది.. దీంతో మొత్తం మీద 365రోజుల వ్యాలిడిటీ లభించనుంది. ఇక, ఈ ప్లాన్‌ కింద లభించే ప్రయోజనాలను చూస్తే.. రోజుకు 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందించనుంది. అయితే, ఈ ఆఫర్‌కు డెడ్‌లైన్‌ పెట్టింది జియో.. కేవలం 2022 జనవరి 2వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. అదనంగా జియో సినిమా, జిటో టీవీ, జియో క్లౌడ్, జియో సావన్ లాంటి జియా సూట్ యాప్స్ యాక్సెస్ పొందవచ్చు అని పేర్కొంది జియో.

Exit mobile version