Jio Diwali Offer 2025: దీపావళి పండుగకు జియో అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఒకవేళ మీకు అదృష్టం ఉండి ఇది తగిలితే మీరు రూ.10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది. తాజాగా జియో ఫైనాన్స్ దీపావళికి పండుగ ఆఫర్‌ను ప్రకటించింది. మార్కెట్‌లో జియో గోల్డ్ 24కె డేస్ పేరుతో అందుబాటులో ఉంది. పండుగ సందర్భంగా బంగారం కొనుగోళ్లు జోరుగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీ బంఫర్ ఆఫర్‌ను ప్రారంభించింది.
READ ALSO: Devi Sri Prasad: అంతమంది హీరోలు కాదన్న సినిమా ఎందుకు?
ఆఫర్ ఏంటో తెలుసా..
కంపెనీ ప్లాట్‌ఫామ్‌ల నుంచి డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్‌లు ఈ ఆఫర్‌లను అందుకుంటారని జియో తెలిపింది. జియోఫైనాన్స్, మైజియో యాప్‌ల ద్వారా కస్టమర్లు డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇది పరిమిత కాలపు పండుగ ఆఫర్ అని చెప్పింది. అలాగే JioFinance లేదా MyJio యాప్ ద్వారా కొనుగోళ్లు చేస్తే 2% అదనపు బంగారం లభిస్తుందని పేర్కొంది. అలాగే కస్టమర్లకు అదనపు బహుమతులు కూడా ఉన్నాయని వెల్లడించింది.
రిలయన్స్ జియో ప్రకారం.. అక్టోబర్ 18 నుంచి 23 వరకు జియోఫైనాన్స్ యాప్ ద్వారా చేసే డిజిటల్ కొనుగోళ్లకు కస్టమర్లు బహుమతులు అందుకుంటారు. గోల్డ్ 24K డేస్ ఆఫర్ యాప్‌లో కనిపిస్తుంది. మీరు దాన్ని పొందవచ్చని చెప్పింది. జియోఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసే ప్రతి రూ.2 వేల విలువైన బంగారంపై 2% అదనపు బంగారం లభిస్తుందని కంపెనీ తెలిపింది. కొనుగోలు చేసిన 72 గంటల్లోపు ఇది వినియోగదారుడి గోల్డ్ వాలెట్‌కు జోడిస్తారని పేర్కొంది.
లక్కీ డ్రా ద్వారా విజేతలను నిర్ణయిస్తారని, కానీ రూ.20 వేలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసే కస్టమర్లు మాత్రమే జియో గోల్డ్ మెగా ప్రైజ్ డ్రాలో పాల్గొనడానికి అర్హులు అని చెప్పింది. ఈ లక్కీ డ్రాలో కంపెనీ మొత్తం రూ.10 లక్షల బహుమతిని నిర్ణయించింది. అయితే రూ.10 లక్షలలో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, బంగారు నాణేలు, మిక్సర్ గ్రైండర్ల వరకు ప్రతిదీ ఉంటుంది. మీకు అదృష్టం ఉంటే పైన పేర్కొన్న బహుమతుల్లో డ్రాలో ఏదో ఒకటి గెలుచుకోవచ్చు. లక్కీ డ్రా ఫలితాలు అక్టోబర్ 27న ప్రకటిస్తారని కంపెనీ పేర్కొంది. అయితే దీపావళి సమయంలో లక్కీ డ్రాల గురించి అనేక నకిలీ సందేశాలు ఫోన్, ఇమెయిల్ ద్వారా కూడా వస్తాయని, లక్కీ డ్రాలో పాల్గొనే ముందు వాస్తవాలను తనిఖీ చేయాలని సూచించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయకుండా లక్కీ డ్రా ద్వారా లేదా చౌక ధరలకు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించవద్దని హెచ్చరించింది.
READ ALSO: X Mark On Train Coach: రైలు వెనుక “X” గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా!
