ITR Filing Extension: ట్యాక్స్ పేయర్స్కి గుడ్‌న్యూస్.. ఐటీఆర్ దాఖలు గడువు పెంపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ITR Filing Extension: ట్యాక్స్ పేయర్స్కి గుడ్‌న్యూస్ వచ్చింది. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీని ఆదాయపు పన్ను శాఖ మరో రోజు పొడిగించింది. నిన్నటితో చివరితేదీ ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా సెప్టెంబర్ 16న ITR దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది. ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో ఈ సమాచారాన్ని అందించింది. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా కొందరు రిటర్న్‌లను దాఖలు చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారని, అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 16 సెప్టెంబర్ తెల్లవారుజామున 12:00 నుంచి 2:30 వరకు ఈ-ఫైలింగ్ పోర్టల్ నిర్వహణ మోడ్‌లో ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. ఐటీఆర్ దాఖలు తేదీని ఒక రోజు పొడిగించడం వల్ల పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం లభించింది.
READ MORE: M.S. Subbulakshmi Birth Anniversary : కళామతల్లికి వెలకట్టలేని కానుక.. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి
Also Read
- LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
- Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
- LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
- EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!
ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ ఓ ట్వీట్ చేసింది. పన్ను చెల్లింపుదారులు దయచేసి గమనించండి!. 2025-26 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు (ITRలు) దాఖలు చేయడానికి గడువు తేదీని మొదట జూలై 31, 2025న చెల్లించాల్సి ఉండగా, దానిని సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ ITRలను దాఖలు చేయడానికి గడువు తేదీని సెప్టెంబర్ 15, 2025 నుంచి సెప్టెంబర్ 16, 2025 వరకు పొడిగించాలని నిర్ణయించింది. యుటిలిటీలలో మార్పులు చేర్పుల కోసం, ఈ-ఫైలింగ్ పోర్టల్ 2025 సెప్టెంబర్ 16న తెల్లవారుజామున 12:00 నుంచి 02:30 వరకు నిర్వహణ మోడ్‌లో ఉంటుంది.” అని పేర్కొంది.
READ MORE: Bhatti Vikramarka : పాత పాపాలు.. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై భట్టి కీలక వ్యాఖ్యలు.!
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!