Site icon NTV Telugu

ITR Filing Extension: ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్.. ఐటీఆర్ దాఖలు గడువు పెంపు..!

Itr

Itr

ITR Filing Extension: ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్ వచ్చింది. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీని ఆదాయపు పన్ను శాఖ మరో రోజు పొడిగించింది. నిన్నటితో చివరితేదీ ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా సెప్టెంబర్ 16న ITR దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది. ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో ఈ సమాచారాన్ని అందించింది. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా కొందరు రిటర్న్‌లను దాఖలు చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారని, అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 16 సెప్టెంబర్ తెల్లవారుజామున 12:00 నుంచి 2:30 వరకు ఈ-ఫైలింగ్ పోర్టల్ నిర్వహణ మోడ్‌లో ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. ఐటీఆర్ దాఖలు తేదీని ఒక రోజు పొడిగించడం వల్ల పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం లభించింది.

READ MORE: M.S. Subbulakshmi Birth Anniversary : కళామతల్లికి వెలకట్టలేని కానుక.. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి

ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ ఓ ట్వీట్‌ చేసింది. పన్ను చెల్లింపుదారులు దయచేసి గమనించండి!. 2025-26 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు (ITRలు) దాఖలు చేయడానికి గడువు తేదీని మొదట జూలై 31, 2025న చెల్లించాల్సి ఉండగా, దానిని సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ ITRలను దాఖలు చేయడానికి గడువు తేదీని సెప్టెంబర్ 15, 2025 నుంచి సెప్టెంబర్ 16, 2025 వరకు పొడిగించాలని నిర్ణయించింది. యుటిలిటీలలో మార్పులు చేర్పుల కోసం, ఈ-ఫైలింగ్ పోర్టల్ 2025 సెప్టెంబర్ 16న తెల్లవారుజామున 12:00 నుంచి 02:30 వరకు నిర్వహణ మోడ్‌లో ఉంటుంది.” అని పేర్కొంది.

READ MORE: Bhatti Vikramarka : పాత పాపాలు.. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై భట్టి కీలక వ్యాఖ్యలు.!

Exit mobile version