Site icon NTV Telugu

Moonlighting IT Notices: మూన్‌లైటింగ్‌ ఉద్యోగులకు ఐటీ నోటీసులు.. 1100 మందికి పైగా జారీ

Moonlighting

Moonlighting

Moonlighting IT Notices: మూన్‌లైటింగ్‌ ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. సుమారు 1100 మందికి పైగా ఐటీ శాఖ నోటీసులను జారీ చేసింది. మూన్‌లైటింగ్ ద్వారా అదనపు డబ్బు(ఆదాయం) సంపాదించిన వ్యక్తులకు ఐటీ శాఖ నోటీసులు పంపుతోంది. వారు మూన్‌లైట్‌ ద్వారా సంపాదించిన ఆదాయానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోవడంతో ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మూన్‌లైట్‌ ద్వారా ఆదాయం పొందిన వారు ఎక్కువగా సాఫ్ట్ వేర్‌ రంగంలోనే ఎక్కువ మంది ఉన్నారు. వారిలోనే ఎక్కువ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. మూన్‌లైటింగ్‌ ద్వారా 2019-2020, 2020-2021 ఆర్థిక సంవత్సరాల ఆదాయాలకు సంబంధించి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు ఆంగ్ల పత్రిక ది ఎకనమిక్‌ టైమ్స్‌ పేర్కొంది.

Read also: Botsa Satyanarayana : ఇంకొక ఆరు నెలల్లో చంద్రబాబుకు ప్రజలు పూర్తిగా విశ్రాంతి ఇస్తారు

మూన్‌లైటింగ్‌ అంటే ఒక వ్యక్తి ఒక కంపెనీలో పూర్తి స్థాయిలో ఉద్యోగిగా పనిచేస్తూనే.. అదనపు ఆదాయం కోసం అతను మరో సంస్థలో పనిచేసి కొంత జీతం తీసుకుంటారు. మరికొందరు నెలవారీ, ఇంకొందరు మూడు నెలలకోసారి చొప్పున ఆదాయంగా తీసుకుంటారు. దీనినే మూన్‌లైటింగ్‌ అంటారు. అంటే తాను పొందే వేతనం కంటే అదనపు పని ద్వారా పొందే అదనపు ఆదాయమన్నమాట. ఈ మూన్‌లైటింగ్‌ కరోనా సమయంలో ఎక్కువగా ఉపయోగించుకున్నారు. అదీ కూడా చాలా వరకు సాఫ్ట్ వేర్‌ ఉద్యోగులే ఎక్కువగా ఉపయోగించుకున్నారు. వారికి వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చారు కాబట్టి.. వారు ఇంటి దగ్గర ఉంటూ వారి కంపెనీ పనులను చేస్తూనే.. ఇతర కంపెనీలకు కూడా పని చేసి అదనపు ఆదాయం పొందారు. అటువంటి ఆదాయమే మూన్‌లైటింగ్‌ అంటున్నారు. అయితే ఇలా అదనంగా మూన్‌లైటింగ్‌ ద్వారా ఆదాయం పొందిన వారిలో కొందరు ఐటీ రిటర్న్స్ చెల్లించినప్పటికీ కొందరు ఐటీ చెల్లించలేదు. అటువంటి వారికి ఇపుడు ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తోంది. రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు వార్షికాదాయాన్ని రిటర్నుల్లో చూపించని వారికి ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ETలో ప్రచురించిన నివేదిక ప్రకారం 2019-2020 మరియు 2020-2021 ఆర్థిక సంవత్సరాలకు 1,000 నుంచి 1100 మంది కంటే ఎక్కువ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ముంబైకి చెందిన పెట్టుబడి మరియు పన్ను నిపుణుడు బల్వంత్ జైన్ మాట్లాడుతూ ప్రాథమికంగా, మూన్‌లైటింగ్ అంటే ఒక వ్యక్తి రెండు ప్రదేశాల నుండి జీతం పొందినప్పుడు.. పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు అదే పేర్కొనాలని భావిస్తున్నారని.. అయితే ఆదాయపు పన్ను చట్టాలు రెండు చోట్ల పని చేయడాన్ని నిషేధించవని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version