NTV Telugu Site icon

Isha Ambani : లెహంగాలో ఇషా అంబానీ ఎంత అందంగా ఉందో చూశారా?

Ishaaa

Ishaaa

ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పలు వ్యాపారాల్లో రానిస్తుంది.. వ్యాపార వేత్త మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఐకాన్ కూడా.. ట్రెండ్ కు తగ్గట్లే ఉంటుంది.. తల్లి, కూతుర్లు ఇద్దరు అలానే ఉంటారు.. వాళ్లు వాడే ప్రతిదీ చాలా ఖరీదైనవి మరియు స్పెషల్ గా ఉంటాయి.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఇషా అంబానీ గ్రాండ్ లుక్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.. ఆ ఈవెంట్స్ లో వాళ్ళు ధరించిన చీరలు, నగల ధరలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు దారి తీస్తున్నాయి..ఇషా అంబానీ రాయల్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది…ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో ఇషా ఎరుపు, ఆకు పచ్చరంగు కలిగిన లెహంగాను ధరించింది… ఈ లెహంగాలో ఇషా బాపు బొమ్మలాగా చాలా అందంగా కనిపిస్తుంది…ఒక్కమాట లో చెప్పాలంటే మహారాణిగా ఉంది..

ఆ లెహంగాను ప్రత్యేకంగా ఎంబ్రాయిడరీ చేశారు. రెడ్ మరియు గ్రీన్ పూసలతో అలంకరించడం విశేషం. దీన్ని డిజైనర్ అబు జానీ సందీప్ ఖోస్లా దీన్ని తయారు చేశారు.. ఈ లెహంగా బ్లౌజ్ పూర్తిగా బంగారం , డైమండ్ లతో హ్యాండ్‌వర్క్‌ చెయ్యడం వల్ల కొత్త లుక్ ను తీసుకొచ్చింది.. దీని ధర కూడా కోట్లల్లో ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు.. ఆమె డ్రెస్సుకు తగ్గట్లే చెవులకు, నెక్లేస్ ను ధరించింది.. ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..