Investment Tips: అనేకమంది ఉద్యోగులలో వారు రిటైరైన తర్వాత ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు పడకుండా జీవితం ప్రశాంతంగా కొనసాగించాలని కోరుకుంటారు. అయితే ఇది కేవలం కలగానే మిగిలిపోకుండా సరైన ఆర్థిక ప్రణాళికతో నిజం చేయవచ్చు. ఒకవేళ మీరు రిటైర్మెంట్ అయ్యే సమయానికి మీ లక్ష్యం రూ.2 కోట్ల డబ్బును సంపాదించడం అయితే, ఇప్పటి నుంచే దీన్ని ఎలా సాధించాలో ఒకసారి చూద్దాం..
మీ వయసు ఇప్పుడు 30ఏళ్లు అయితే, ఒకవేళ మీరు 50ఏళ్లకే రిటైర్ కావాలంటే మీ దగ్గర 20 ఏళ్ల సమయం ఉంటుంది. అందుకు మీరు నెలకు రూ.22,000ను SIP రూపంలో ఇన్వెస్ట్ చేస్తే (సగటు 12% వార్షిక రాబడితో) 20 ఏళ్లలో రూ.2 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అయితే, రాబడి 10% మాత్రమే వస్తుందని అనుకుంటే నెలకు దాదాపు రూ.28,000 వరకు పెట్టుబడి అవసరం పడుతుంది.
Grok Spicy Mode: AIకి కూడా ‘స్పైసీ’ మూడ్.. అడల్ట్ కంటెంట్ మరింత ప్రమాదంగా మారనుందా?
ఇలాంటి విషయాలపై సరైన పెట్టుబడి ఎంపికలు చాలా అవసరం. ఆర్ధిక పెట్టుబడుల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు దీర్ఘకాలికంగా సంపద పెంచే అత్యుత్తమ మార్గంగా చెప్పవచ్చు. అంతేకాకుండా లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్ ను కూడా ఎంచుకోవచ్చు. వీటిని ఎంచుకొనే సమయంలో సరైన వాటిని ఎంచుకొని అందులో ఇన్వెస్ట్ చేయడం ఎంతో ముఖ్యం. వీటి కోసం ఎవరైనా నమ్మదగిన వ్యక్తులను సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం పోర్ట్‌ఫోలియోను రివ్యూ చేసి, అవసరమైతే రీబ్యాలెన్స్ చేయండి. భద్రతను కోరుకునే వారు 70:30 నిష్పత్తిలో ఈక్విటీ-డెబ్ ఫండ్లలలో పెట్టుబడి పెట్టొచ్చు. అలాగే రిటైర్మెంట్‌కు ముందు 5 ఏళ్లు ఇన్వెస్ట్మెంట్స్ వైపు మళ్లించండి.
Vizag: ఆరుగురు పతివ్రతలు అరెస్ట్.. పేకాట ఆడుతున్న భార్యపై ఫిర్యాదుతో గుట్టురట్టు!
మరోవైపు ప్రతి సంవత్సరం మీ ఆదాయం పెరుగుతుంటే, SIPలో పెట్టే మొత్తాన్ని కూడా 10% వరకు పెంచడం (Step-Up SIP) మంచిది. ఇది భవిష్యత్‌లో పెట్టుబడి భారం తగ్గిస్తుంది. అలాగే ద్రవ్యోల్బణాన్ని మించేందుకు సహాయపడుతుంది. ఇలా డబ్బులను ఆదా చేసే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవేంటంటే.. తరచుగా వెకేషన్లు, ఫ్యాన్సీ గాడ్జెట్లు, షాపింగ్ వంటి అవసరంలేని ఖర్చులను తగ్గించండి. ఇంకా ఆదా చేసిన డబ్బును మీ ప్రస్తుతం ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ స్కీములలో లేదా కొత్త రిటైర్మెంట్ ఫండ్లలో పెట్టండి.
