NTV Telugu Site icon

Semi Conductors : ఇజ్రాయిల్ కంపెనీని టేకోవ‌ర్ చేసుకున్న ఇంటెల్‌…

క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌త ఏర్ప‌డింది. కొన్ని దేశాలు మాత్ర‌మే సెమీకండ‌క్ట‌ర్ల‌ను త‌యారు చేస్తున్నాయి. దీంతో భారీగా డిమాండ్ పెరిగింది. క‌రోనా మ‌హ‌మ్మారి కాలంలో ట్రాన్స్‌ఫోర్ట్ ఫెసిలిటీ త‌గ్గిపోవ‌డంతో ఈ కొర‌త ఏర్పడింది. అంతేకాదు, ప‌రిశ్ర‌మ‌లను మూసివేయ‌డం కూడా ఇందుకు ఒక కార‌ణం. ఈ కొర‌త త‌గ్గి తిరిగి య‌ధాస్థితికి రావాలి అంటే చాలా కాలం ప‌డుతుంది. చాలా దేశాలు సొంతంగా ప్లాంట్‌ల‌ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కొన్ని సంస్థ‌లు సెమీకండ‌క్ట‌ర్లు త‌యారు చేస్తున్న కంపెనీల‌ను టేకోవ‌ర్ చేసుకుంటున్నాయి.

Read: Covid 19: షాకింగ్‌… మృత‌దేహంలో 41 రోజుల‌పాటు క‌రోనా

ఇందులో భాగంగానే ఇజ్రాయిల్‌కు చెందిన ట‌వ‌ర్ అనే సెమీకండ‌క్ట‌ర్ కంపెనీని ఇంటెల్ 5.4 బిలియ‌న్ డాల‌ర్ల‌కు టేకోవ‌ర్ చేసుకున్న‌ది. పెరుగుతున్న డిమాండ్‌తో సెమీకండ‌క్ట‌ర్ల సామ‌ర్థ్యం, సాంకేతిక‌త ఫోర్ట్‌ఫోలియోను విస్త‌రించాల‌ని ఇంటెల్ చూస్తున్న‌ది. ట‌వ‌ర్ కంపెనీలోని ఒక్కో షేర్‌ను 53 డాల‌ర్ల చొప్పున కొనుగోలు చేసింది. మొత్తం 5.4 బిలియ‌న్ డాల‌ర్ల‌కు టేకోవ‌ర్ చేసుకోవ‌డానికి ట‌వ‌ర్ సెమీకండ‌క్ట‌ర్ అంగీక‌రించిన‌ట్టు ఇంటెల్ సంస్థ పేర్కొన్న‌ది.