NTV Telugu Site icon

Infosys: వారానికి మూడు రోజులు ఆఫీస్‌కి రావాల్సిందే.. తప్పనిసరి చేయనున్న ఇన్ఫోసిస్..

Infosys

Infosys

Infosys: కోవిడ్-19 మహమ్మారి కారణంగా పలు కంపెనీలు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపయాన్ని కల్పించాయి. కరోనా ప్రభావం తగ్గినా కూడా కొందరు ఉద్యోగులు ఇంకా వర్క్ ఫ్రం హోం పద్ధతిలోనే పనిచేస్తామని కోరుకుంటున్నారు. అయితే ఐటీ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని కొరుతున్నాయి. కొన్ని సంస్థలు కార్యాలయాలకు రాకుంటే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలో దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ కూడా తన ఉద్యోగులను కూడా ఆఫీసులకు రమ్మని కొరబోతున్నట్లు సమచారం. వారానికి మూడు రోజులు ఆఫీసుల నుంచే పనిచేయడాన్ని తప్పనిసరి చేయబోతున్నట్లు తెలుస్తోంది. నార్మల్ ఆఫీస్ రొటీన్ ప్రోత్సహించడంలో మేనేజ్మెంట్ విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్పాదకతను పెంచడానికి వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి ఇటీవల కోరిన తర్వాత ఈ వార్త వచ్చింది.

Read Also: Air India: ఎయిరిండియా పైలట్లకు, సిబ్బందికి కొత్త యూనిఫాం.. అదిరిపోయేలా మనీష్ మల్హోత్రా డిజైన్..

ఇప్పటికే ఇన్ఫోసిస్ వర్టికల్ హెడ్స్ వారానికి మూడు రోజులు కార్యాలయానికి రావాలని కోరుతూ ఉద్యోగులకు ఈమెయిల్స్ వెళ్లాయి. అయితే వీటిపై ఇన్ఫోసిస్ అధికారికంగా స్పందించలేదు. వైద్యపరిమైన కారణాలుతో మినహా ఉద్యోగులు తప్పనిసరిగా కార్యాలయం నుంచే పనిచేయాలని ఆదేశాల్లో పేర్కొంది. కిందిస్థాయి ఉద్యోగులు ప్రతీ నెల పది రోజులు కార్యాలయానికి రావాలని ఇన్ఫోసిస్ ఇటీవల కోరింది.

ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే కాదు, ఇతర ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి. విప్రో తన ఉద్యోగులకు హైబ్రిడ్ పాలసీని తీసుకువచ్చింది. వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలని కోరింది. ఇది జనవరి 7 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. టీసీఎస్ కూడా వర్క్ ఫ్రం ఆఫీసు విధానాన్ని పునరుద్ధరిస్తోంది.