Infosys: కోవిడ్ మహమ్మారి కాలంలో, టెక్ కంపెనీలతో పాటు చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్-ఫ్రమ్-హోమ్ విధానం ద్వారా పనిచేయించుకున్నాయి. అయితే, మహమ్మారి తగ్గి రెండు మూడేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికే మొగ్గు చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే, చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
తాజాగా, దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల నెలలో 10 రోజలు ఆఫీస్ నుంచి పని చేయాలనే ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని బుధవారం చెప్పింది. కొత్త హాజరు వ్యవస్థని అమలు చేయనుంది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రతీ నెల నిర్దేశించిన రోజుల పాటు కార్యాలయం నుంచి పనిచేయాలి.
Read Also: MK Stalin: చంద్రబాబు, రేవంత్ రెడ్డిలకు స్టాలిన్ ఆహ్వానం.. “డీలిమిటేషన్”పై మీటింగ్..
కంపెనీలోని ఫంక్షనల్ హెడ్స్, వారి అసోసియేట్స్ ఇంటి నుంచి పని చేసే రోజులను పరిమితం చేయాలని ఉద్యోగులకు మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త ‘‘సిస్టమ్ ఇంటర్వెన్షన్’’ ప్రక్రియ డిపార్ట్మెంటల్ రిక్వెస్ట్ కన్నా, ప్రాజెక్ట్ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అంటే దీని అర్థం.. వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్‌లు ఇకపై ఆటోమెటిక్‌గా ఆమోదించబడవు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఉద్యోగులు పంచ్ అటెండెన్స్ కోసం మొబైల్ యాప్‌ని ఉపయోగిస్తున్నారు. ఇది డిఫాల్ట్‌గా వర్క్ ఫ్రమ్ హోం రిక్వెస్ట్‌ని అంగీకరిస్తుంది. ఇప్పుడు దీనికి బదులుగా, ఉద్యోగులు ఆఫీసుల్లో 10 రోజులు ఫిజికల్‌గా కనిపించాలి.
Read Also: Toyota: “బ్లాక్ టైగర్”.. టయోటా నుంచి మార్కెట్లోకి కొత్త ఎడిషన్..
జాబ్ లెవల్ -5(JL5), అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఇందులో జేఎల్-5లో టీమ్ లీడర్లు ఉండగా, కింద స్థాయిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, సిస్టమ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు ఉన్నారు. JL6 లో మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, సీనియర్ డెలివరీ మేనేజర్లు ఉన్నారు. మార్చి 10, 2025 నుంచి ప్రతీ నెల వర్క్ ఫ్రమ్ హోమ్ పనిదినాలు పరిమితం కానున్నాయి. ఉద్యోగుల ప్లెక్సీబిలిటీని కొనసాగిస్తూ హైబ్రిడ్ మోడ్‌లో పని అవసరాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు సంస్థ చెబుతోంది.
వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఆఫీస్ కల్చర్ పాడవ్వడంతో పాటు ఉద్యోగులు అందుబాటులో ఉండకపోవడం, సమన్వయం లేకపోవడం, ప్రొడక్టివిటీ తగ్గడం వంటివి జరుగుతున్నట్లు టెక్ కంపెనీలు చెబుతున్నాయి. దీంతో ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. టీసీఎస్ ఉద్యోగులు వెరియబుల్ కంపన్‌సేషన్ 5-డేస్ ఆఫీస్ హాజరు విధానాన్ని, విప్రో హైబ్రిడ్ మోడల్‌ని కలిగి ఉంది. ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాల్సి ఉంటుంది.