NTV Telugu Site icon

Cognizant: మా వాణిజ్య రహస్యాలని ఇన్ఫోసిస్‌ దొంగిలించింది..

Infisis

Infisis

Cognizant: ప్రముఖ ఐటీ సంస్థలైన కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌ల మధ్య వివాదం కొనసాగుతోంది. అమెరికన్ న్యాయస్థానంలో పిటిషన్ వేసిన ఈ ఇరు సంస్థలు గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌పై కాగ్నిజెంట్‌ ఆరోపణలు చేసింది. తమ హెల్త్‌ కేర్‌ సాఫ్ట్‌వేర్‌ ట్రెజెట్టో నుంచి బిజినెస్ కు సంబంధించిన రహస్యాలని ఇన్ఫీ దొంగలించిందని విమర్శలు గుప్పించింది. నాన్‌ డిస్‌ క్లోజర్ అండ్‌ యాక్సెస్‌ అగ్రిమెంట్‌ ద్వారా ట్రెజెట్టో వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిందని పేర్కొనింది. అలాగే, ఈ విషయంపై ఆడిట్‌ చేసేందుకు ఆ కంపెనీ నిరాకరించిందని కాగ్నిజెంట్‌ చెప్పుకొచ్చింది.

Read Also: Rahul Gandhi: అర్ధరాత్రి సీఈసీ నియామకంతో ఎన్నికల ప్రక్రియపై అనుమానాలే

ఇక, హెల్త్‌కేర్‌ సాఫ్ట్‌వేర్‌ ట్రెజెట్టో నుంచి ఇన్ఫోసిస్‌ వాణిజ్య పరమైన రహస్యాలను చోరీ చేసిందని ఆరోపించిన కాగ్నిజెంట్‌ 2024 ఆగస్టులో అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, కాగ్నిజెంట్ ఆరోపణల్ని ఇన్ఫీ తోసిపుచ్చింది. కాగ్నిజెంట్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ బహిరంగంగా ఉన్నాయని వెల్లడించింది. అంతేకాదు.. ప్రస్తుతం ఆ సంస్థలో ఉన్న రవికుమార్‌ తమ దగ్గర పని చేసిన సమయంలో హెల్త్‌కేర్‌ సాఫ్ట్‌వేర్‌ రిలీజ్ చేయడాన్ని ఆలస్యం చేశారని ఇన్ఫోసిస్‌ కూడా ప్రత్యారోపణలు చేసింది. కాగ్నిజెంట్ లో ఉద్యోగం కోసం ఆయన చర్చలు చేశారని పేర్కొంది. అయితే, ఇన్ఫోసిస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించిన రవి కుమార్‌ 2022 అక్టోబర్‌లో ఆ సంస్థను వదిలి పెట్టాడు. ఆ తర్వాత ఏడాది జనవరిలో కాగ్నిజెంట్ లో సీఈవోగా చేరారు. ఈ రెండు ఐటీ కంపెనీలు ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో గట్టిగా పోటీ పడుతున్నాయి. ఇన్ఫోసిస్‌ ఆదాయంలో దాదాపు 7.5 శాతం లైఫ్‌ సైన్సెస్ విభాగం పొందుతోంది అని చెప్పాలి.