NTV Telugu Site icon

Anand Mahindra: వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర.. మీరు కూడా నీటిపై పరుగెత్తవచ్చు..!

Anand Mahindra

Anand Mahindra

Anand Mahindra: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర.. బిజినెస్‌ వ్యవహారాలతో పాటు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను షేర్‌ చేస్తారు.. నవ్విస్తారు.. ఆలోచింపజేస్తారు.. ఎన్నో కొత్త విషయాలను పంచుకుంటూ ఉంటారు.. ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్లను మీరు తప్పకుండా చూసి ఉంటారు. తరచుగా అతను కొత్త టెక్నాలజీ గురించి మాట్లాడతాడు. ప్రజలతో భవిష్యత్ అవకాశాలు మరియు అవసరాలపై సమాచారాన్ని షేర్‌ చేస్తారు.. దేశంలో, ప్రపంచంలో ఎక్కడ మంచి పనులు జరిగినా, వాటి గురించి అందరికీ చెబుతారు. ఆవిష్కరించే వారిని కూడా మెచ్చుకుంటాడు. ఈ సారి ఓ వీడియో షేర్ చేసి పాజిటివ్ గా మెసేజ్ ఇచ్చాడు. తాజాగా ఆయన చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. నీటిపై భయం, బెరుకు లేకుండా.. ఒక గుర్రం శరవేగంతో పరుగులు తీస్తున్న ఓ వీడియోను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు ఆనంద్‌ మహీంద్ర.. ఏ పని చేయాలన్నా మన మీద మనకి నమ్మకం ఉండాలి… విశ్వాసం ఉంటే మీరు నీటిపై కూడా నడవవచ్చు.. అంతా మన సంకల్పంలోనే ఉంది.. మన మనసులోనే ఉంది.. సో, మీ కలసాకారం కోసం ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకేయండి.. అంటూ మండే మోటివేషన్‌ సందేశాన్ని ట్విట్టర్‌లో తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.

Read Also: Helicopter Faces Landing Issues: టెన్షన్‌ పెట్టిన హెలికాప్టర్‌.. మాజీ సీఎంకు తప్పిన ముప్పు..

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గుర్రం నీటిలో పరుగెత్తుతూ కనిపించింది. దాదాపు 11 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో, గుర్రం నీటిలో ఎలా సులభంగా పరిగెత్తిందో మీరు చూడవచ్చు. నీటిలో పరుగెత్తడం అంత సులభం కాదని మనందరికీ తెలుసు. ఒక పరిశోధన ప్రకారం, మీ వేగం 67 mph కంటే ఎక్కువగా ఉంటే, మీరు మాత్రమే నీటిలో సులభంగా పరిగెత్తగలరు. ఇది మన పాదాలు సృష్టించే వేగం కంటే 20 రెట్లు ఎక్కువ. అందుకే నీటిలో పరుగెత్తడానికి ప్రయత్నించినప్పుడల్లా అలసిపోతాం. ఇక, మహీంద్రా షేర్‌ చేసిన వీడియోలో 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది.. “మీరు నీటిపై కూడా నడవవచ్చు, అయితే దీనికి మీపై మీకు నమ్మకం ఉండాలి. అదంతా మైండ్ గేమ్. మీపై మరియు మీ ఆకాంక్షలపై నమ్మకంతో మీ వారాన్ని ప్రారంభించండి.. అంటూ ప్రేరణ కల్పించే వీడియో పాటు.. మంచి మాటలు రాసుకొచ్చారు.. ఈ వీడియోను ఇప్పటివరకు నాలుగు లక్షలకు పైగా వీక్షించారు. దాదాపు ఆరు వేల మంది లైక్ చేయగా, వందల మంది కామెంట్ చేశారు. ఖచ్చితంగా సార్! షావోలిన్ మాస్టర్స్ ఇలా చేయడం చూశారు. వేద గ్రంధాలలో కూడా విన్నారు మరియు చదివారు. ఇది ఒక యుద్ధ కళ, పురాతన కాలం నుండి ప్రజలు దీనిని అభ్యసిస్తున్నారు అంటూ ఓ నెటిజన్‌ రాసుకొచ్చాడు.. ఇక, మహీంద్ర ట్వీట్‌పై రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు..