Indo Thai Securities Share: ఓ చిన్న కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్‌ను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇంతకీ ఏంటి విషయం అనుకుంటున్నారా.. ఒకప్పుడు 2 రూపాయల కంటే తక్కువ ధర పలికిన ఈ కంపెనీ షేర్లు ఇప్పుడు పెట్టుబడిదారులను లక్షాధికారులుగా మార్చాయి. ఇంతకీ ఆ స్టాక్ పేరు ఏంటో తెలుసా.. ఇండో థాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్. ఈ స్టాక్‌లో పెట్టుబడి పెట్టిన అందరిని ఆశ్చర్యపోయేంత లాభాలను కురిపించింది.
READ ALSO: Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటు మాదే.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు!
నెలలో దాదాపు రెట్టింపు డబ్బు..
గత నెలలోనే ఈ స్టాక్ 90% కంటే ఎక్కువ పెరిగింది. ఎవరైనా ఒక నెల క్రితం ఈ స్టాక్‌లో ₹100,000 పెట్టుబడి పెట్టి ఉంటే, ప్రస్తుతం వారి ఖాతాలో ఈరోజు ₹190,000 ఉంటుంది. దీని అర్థం కేవలం ఒక నెలలోనే ₹90,000 ప్రత్యక్ష లాభం వారికి ఈ స్టాక్ అందజేసింది. సోమవారం కూడా ఈ స్టాక్ మార్కెట్‌లో 3.31% లాభపడి ₹315ను మార్క్‌ను క్రాస్ చేసింది.
ఏడాదిలో రూ.లక్ష, రూ.4 లక్షలు అయింది..
స్టాక్ ఒక ఏడాది అంచనాలను పరిశీలిస్తే.. దీని ఫలితాలు అద్భుతంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక సంవత్సరంలోనే పెట్టుబడిదారుల రాబడిని దాదాపు నాలుగు రెట్లు పెంచింది. అంటే ఏడాది క్రితం ఈ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన వ్యక్తికి ఇప్పుడు దాదాపు ₹4 లక్షలు లాభం వస్తుంది. సోమవారం మార్కెట్‌లో ఈ స్టాక్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.317 తాకింది. దీని జోరు ఇంకా ఆగలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
5 ఏళ్లలో లక్షాధికారి..
ఐదేళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ స్టాక్ నిజమైన విలువ అర్థం అవుతుంది. వాస్తవానికి నేడు ఆ స్టాక్ ధరకు అప్పటి ధరకు పొంతన లేదు. కానీ ఈ స్టాక్ ఐదు సంవత్సరాలలో 18,300% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. ఐదు సంవత్సరాల క్రితం ఈ స్టాక్ విలువ కేవలం ₹1.71, ₹2 కంటే తక్కువగా ఉండేది. కానీ నేడు దాని ధర రూ.315 కంటే ఎక్కువ. ఇప్పుడు ఆ స్టాక్ లాభాల లెక్కింపును పరిశీలిస్తే.. ఆ సమయంలో ఈ స్టాక్‌లో ₹1 లక్ష పెట్టుబడి పెట్టడానికి ధైర్యం చేసిన వారు ఎవరైనా ఇప్పుడు తమ డబ్బు ₹18.4 మిలియన్లకు పైగా పెరగడం చూసి ఉండేవారు అంటే నమ్మండి. కేవలం ₹1 లక్ష పెట్టుబడి ఐదేళ్లలో ₹18.3 మిలియన్లకు పైగా లాభాన్ని ఆర్జించిందంటే మాటలు కాదండి. ఆ సమయంలో ఈ స్టాక్‌ను కొనుగోలు చేసిన వాళ్లు ఇప్పుడు కోట్లకు అధిపతి అవుతారు.
READ ALSO: Italy Road Accident: ఇటలీలో రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి
డిస్క్లైమర్: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే, దీనిని పెట్టుబడి సలహాగా భావించకూడదు.
