NTV Telugu Site icon

IndiGo Revenue Soars. But: ఇండిగో ఆదాయానికి రెక్కలు. అయినా చుక్కలే..

Indigo Revenue Soars. But

Indigo Revenue Soars. But

IndiGo Revenue Soars. But: దేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్స్ అయిన ఇండిగో ఆదాయం రికార్డ్‌ స్థాయిలో 328 శాతం పెరిగింది. తద్వారా 12,855 కోట్ల రూపాయలు దాటింది. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల ఫలితాలను వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో రెవెన్యూ కేవలం 3 వేల కోట్లే వచ్చింది. అయితే ఈసారి భారీ ఆదాయం వచ్చినప్పటికీ పెరిగిన విమాన ఇంధనం ధరలతోపాటు రూపాయి విలువ పడిపోవటంతో నష్టాలను నమోదుచేసింది.

జులైలో హై’బీపీ’

జులై నెలలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లను దాదాపు 1200 బేసిస్‌ పాయింట్లు పెంచాయి. భారీగా పెరిగిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయటానికి అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అత్యధికంగా ట్రేడింగ్‌ అవుతున్న ఐదు కరెన్సీలను పర్యవేక్షించే సెంట్రల్‌ బ్యాంకులే తమ వడ్డీ రేట్లను 325 బేసిస్‌ పాయింట్లు పెంచాయి.

Bank Robbery: బ్యాంకులో దోపిడీ.. అలా వచ్చి రూ.35 లక్షలతో ఉడాయించిన బాలుడు..!

టాప్‌-3లో ఇండియా

ప్రపంచవ్యాప్తంగా 5జీ మార్కెట్‌లో సుమారు 15 శాతాన్ని ఇండియా ఆక్రమిస్తుందని గ్లోబల్‌ టెలికం వర్గాలు అంచనా వేస్తున్నారు. రానున్న రెండేళ్లలో దేశంలోని సగానికి పైగా ప్రాంతాల్లో ఈ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. తద్వారా గ్లోబల్‌ మార్కెట్‌లోని టాప్‌-3 దేశాల్లో ఇండియా చోటుసంపాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

21 నుంచి 20కి

మార్కెట్‌ సమాచార సలహా సంఘంలో సెబీ మార్పులు చేర్పులు చేసింది. సభ్యుల సంఖ్యను స్వల్పంగా తగ్గించింది. ఈ కమిటీలో గతంలో మొత్తం 21 మంది సభ్యులు ఉండేవారు. ఇప్పుడు 20కి కుదించింది. ఈ విషయాన్ని తన వెబ్‌సైట్‌లో తాజాగా పేర్కొంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ మాజీ ఎండీ అండ్‌ సీఈఓ విక్రమ్‌ లిమాయె స్థానంలో ఎన్‌ఎస్‌ఈ కొత్త చీఫ్‌ అభిషేక్‌ కుమార్‌ చౌహాన్‌కి చోటు కల్పించింది.

‘విండ్‌ఫాల్‌’పై అత్యాశ

విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌లో సవరణలు చేయకుండా స్థిరంగా ఉంచినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగతా 9 నెలల్లో రానున్న ఆదాయం 48 వేల కోట్ల లోపు మాత్రమే ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన రేట్లను పరిగణనలోకి తీసుకుంటేనే ఈమాత్రం వస్తుందని పేర్కొన్నాయి. 94,800 కోట్లు వస్తుందనుకోవటం ఓవర్‌ ఎస్టిమేషనేనని చెప్పాయి. విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ని ఇటీవల కొంచెం తగ్గించిన సంగతి తెలిసిందే.

‘ఫారెక్స్‌’ పెరగాలంటే..

మన దేశంలో విదేశీ మారక నిల్వలు పెరగాలంటే మిలీనియల్‌ బాండ్స్‌ని మళ్లీ ప్రవేశపెట్టాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 2008లో కూడా ఇలాగే చేశారని సీఐఐ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ బజాజ్‌ గుర్తుచేశారు. ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని కోరారు. తద్వారా వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం పెరిగి ఎకానమీకి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.