NTV Telugu Site icon

Airlines Ranks: ప్రపంచంలోనే చెత్త ఎయిర్‌లైన్స్‌ ఇదే! ఇండిగో ర్యాంక్ ఎంతంటే..!

Indigo

Indigo

ప్రయాణమంటే ఎవరైనా సాఫీగా.. సౌకర్యవంతంగా జరగాలని కోరుకుంటారు. ఇక విమాన ప్రయాణమంటే మరింత సౌకర్యాలను కోరుకుంటారు. మేలుకరమైన సేవలతో పాటు నాణ్యతకు ప్యాసింజర్లు ప్రాధాన్యత ఇస్తుంటారు. అంతేకాకుండా సమయానికి గమ్యానికి చేరుకోవాలని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్‌ ఎయిర్‌లైన్స్‌ ఇండస్ట్రీ ప్రతి ఏటా ప్రయాణికులకు అవగాహన కల్పించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది.

ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని గాలికొదిలేసింది..

ప్రయాణికులను ఎన్ని సార్లు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేర్చింది. సౌకర్యం, సేవలు, ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించి.. వాటి ఆధారంగా అత్యుత్తమైనవి, చెత్త సర్వీస్ అందించిన ఎయిర్‌లైన్స్‌గా వేరే చేసి ర్యాంకులు ఇస్తుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌లైన్‌లకు ర్యాంకుల ఇచ్చింది. జనవరి నుంచి అక్టోబర్‌ వరకు గల డేటాను బేస్‌ చేసుకుని ర్యాంకులు ఇచ్చింది. ఇలా ర్యాంకులు ఎందుకంటే.. కేవలం ప్రయాణికుల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎయిర్‌లైన్స్‌ని ప్రోత్సహించడమేనని ఎయిర్‌ హెల్ప్‌ సీఈవో టామ్జ్‌ పౌల్జిన్‌ వెల్లడించారు.

2024 అత్యుత్తమ విమాన సంస్థలు ఇవే..
1. బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్
2. ఖతార్ ఎయిర్‌వేస్
3. యునైటెడ్ ఎయిర్‌లైన్స్
4. అమెరికన్ ఎయిర్‌లైన్స్
5. ప్లే (ఐస్లాండ్)
6. ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్
7. లాట్ పోలిష్ ఎయిర్‌లైన్స్
8. ఎయిర్ అరేబియా
9. వైడెరో
10. ఎయిర్ సెర్బియా

2024 అత్యంత చెత్త విమాన సంస్థలు ఇవే..

100. స్కై ఎక్స్‌ప్రెస్
101. ఎయిర్ మారిషస్
102. తారోమ్
103. ఇండిగో
104. పెగాసస్ ఎయిర్‌లైన్స్
105. ఎల్ అల్ ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్స్
106. బల్గేరియా ఎయిర్
107. నౌవెలైర్
108. బజ్
109. తునిసైర్

బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్ 2018 నుంచి ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ ప్రతిభను కనుపరుస్తోంది. ఖతార్ ఎయిర్‌వేస్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి. ఇక కెనడియన్ క్యారియర్ ఎయిర్ ట్రాన్సాట్ 36వ స్థానంలో నిలవగా, డెల్టా ఎయిర్ లైన్స్ 17వ స్థానానికి పడిపోయింది. అలాగే జెట్‌బ్లూ, ఎయిర్ కెనడా దిగువ 50 స్థానాల్లో నిలిచాయి. అలాస్కా ఎయిర్‌లైన్స్ కూడా 88వ స్థానానికి పరిమతమయ్యింది. ఎయిర్ ఇండియా 61వ స్థానంలోనూ, ఎయిర్ ఏషియా 94వ స్థానంలోనూ ఉన్నాయి.

Show comments