Stock Market: మార్కెట్‌లో కొనసాగుతోన్న నష్టాల పరంపర.. కారణమిదే!

  • మార్కెట్‌లో కొనసాగుతోన్న నష్టాల పరంపర
  • వరుసగా నాల్గో రోజు భారీ నష్టాల్లో సూచీలు
  • అంతర్జాతీయ పరిణామాలే కారణం
Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాల్గో రోజు సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగినా లాభాల్లోనే దూసుకెళ్లింది. అనంతరం ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగించారు. అంతర్జాతీయంగా పరిస్థితులు బాగుంటాయని అంతా భావించారు. కానీ శాంతి ఒప్పందంపై క్లారిటీ రాకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి మార్కెట్ నష్టాల్లోనే కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అంతలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. చమురు ధరల పెరుగుదల, ఐటీ రంగంలో బలహీన సంకేతాలు ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ప్రస్తుతం సెన్సెక్స్ 719 పాయింట్లు నష్టపోయి 76, 944 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 192 పాయింట్లు నష్టపోయి 23, 980 దగ్గర కొనసాగుతోంది. పెట్టుబడిదారులు అప్రమత్తత పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అస్థిరత కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి స్టాక్స్ వెనుకబడ్డాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ను 2 శాతానికి పైగా కిందకు లాగాయి.