Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
- భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్
- రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
- నష్టాలకు ప్రధాన కారణాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. రెండో రోజు కూడా వరుస నష్టాలను చవిచూసింది. ఈ వారం ప్రారంభం నుంచి మార్కెట్ భారీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో సోమవారం దేశీయ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడ్ అయింది. ఇక మంగళవారం కూడా అంతకంటే ఘోరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంది. ఉదయం మార్కెట్ ప్రారంభం అయిన దగ్గర నుంచి నష్టాల్లోనే ట్రేడ్ అయింది. దీంతో రూ.12 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్ 1,456 పాయింట్లు నష్టపోయి 74, 559 దగ్గర ముగియగా.. నిఫ్టీ 436 పాయింట్లు నష్టపోయి 23, 379 దగ్గర ముగిసింది. ఇక రూపాయి విలువ సరికొత్త రికార్డ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.63 దగ్గర సరికొత్త రికార్డ్ స్థాయి దగ్గర ముగిసింది.
పశ్చిమాసియాలో ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరగకపోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి. దీంతో మధ్యప్రాచ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ఇంకోవైపు రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోవడం.. తాజాగా ప్రధాని మోడీ దేశ ప్రజలను పొదుపు మంత్రం పాటించాలని సూచించడం ఇవన్నీ కూడా మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. నిలకడలేని పరిస్థితులు నెలకొనడంతో పెట్టుబడిదారుల్లో భయం నెలకొంది. ఈ నేపథ్యంలో మార్కెట్ భారీ నష్టాలను ఎదుర్కొంటోంది.
Also Read
- LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
- EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
- RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
ఎన్ఎస్ఈలోని మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంకుల రంగాలను మినహాయించి మిగతా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి. నిఫ్టీలో రియల్టీ, ఐటీ స్టాక్స్ అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉండగా నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 3 శాతానికి పైగా పడిపోయింది.
తాజావార్తలు
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!