రైల్వేలో ప్రయాణం సౌకర్యవంతంగా, వేగంగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో జరుగుతుంది. అందువల్ల ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతుంటారు. ప్రయాణికుల అవసరాలు, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
2026 జనవరి 1 నుంచి నాన్–ఏసీ స్లీపర్ కోచ్‌లో ప్రయాణించే వారికి కూడా బెడ్‌షీట్లు, దిండ్లు అందించనున్నట్లు రైల్వే ప్రకటించింది. ఈ సౌకర్యం ఇప్పటివరకు ప్రధానంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ కోచ్‌లలో మాత్రమే లభించేది.గరీబ్ రథ్ వంటి కొన్ని ప్రత్యేక రైళ్లలో బెడ్‌రోల్ కావాలంటే అదనంగా ₹25 చెల్లించాల్సి ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
బెడ్రోల్‌లో రైల్వే అందించే బెడ్‌రోల్‌లో ప్రధానంగా 2 దిండ్లు, 2 బెడ్‌షీట్లు, 1 దుప్పటి, 1 టవల్ ఉంటాయి.స్లీపర్ క్లాస్‌లో బెడ్‌రోల్కొద్ది రైళ్లలో మాత్రమే అందుబాటులో ఉండేదని రైల్వే సిబ్బంది తెలిపారు. అందువల్ల ప్రయాణికులు దుప్పట్లు, బెడ్‌షీట్లు స్వయంగా తీసుకెళ్లాల్సి వచ్చేది లేదా అద్దెకు తీసుకోవాల్సి వచ్చేదన్నారు. 2023–24 నుంచి చలికాలంలో నాన్–ఏసీ స్లీపర్ ప్రయాణికులకు అద్దెకు బెడ్‌షీట్లు అందిస్తుంది. దీనికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించినట్లు అధికారులు తెలిపారు.అయితే వీటికి అదనంగా అద్దె ఛార్జీ ₹50 మాత్రమే తీసుకుంటారని వెల్లడించారు.
2026 జనవరి 1 నుంచి ఈ సౌకర్యాన్ని మొదటగా సదరన్ రైల్వే – చెన్నై డివిజన్‌లో ప్రారంభించనున్నట్లు సమాచారం. దీంతో ప్రయాణికులు మరింత సుఖవంతంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే ప్రకటించింది.
