Indian Market: ఇండియన్ మార్కెట్ తమకెంతో ముఖ్యమని టర్కిష్ ఎయిర్‌లైన్స్ సీఈఓ బిలాల్ ఎక్సి అన్నారు. టర్కిష్ ఎయిర్‌లైన్స్ ప్రపంచంలోనే లార్జెస్ట్ నెట్‌వర్క్ క్యారియర్ అయినప్పటికీ మన దేశంలో ఆ సంస్థ అభివృద్ధికి ప్రతిబంధకాలు ఉన్నాయి. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కి ఇండియాలో ట్రాఫిక్ రైట్స్‌ని పరిమితంగా ఇవ్వటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో నంబర్ వన్ ఎయిర్‌లైన్స్ ఇండిగోతో భాగస్వామ్యాన్ని బలపరచుకోవటం ద్వారా ఇండియన్ మార్కెట్‌లో షేర్ (బిజినెస్) పెంచుకోవాలని టర్కిష్ ఎయిర్‌లైన్స్ ఆశిస్తోంది. ఇందులో భాగంగా బోయింగ్ 777-300ER ఎయిర్‌క్రాఫ్ట్‌లను మూడింటిని ఇండిగోకి లీజుకి ఇస్తోంది.
read also: Kodali Nani: జగన్ పిల్లి కాదు.. పులి.. తెలియకపోతే ఆహారం అయిపోతావ్..!
టర్కీ మరియు ఇండియా మధ్య రెండు కంపెనీల ఫ్లైట్ల కోడ్-షేరింగ్‌కి కూడా ఇరు సంస్థలు అంగీకారం తెలిపాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య వారానికి వన్ వేలో 3 వేల మంది మాత్రమే ప్రయాణం చేయటానికి అనుమతులు ఉన్నాయి. అందుకే టర్కిష్ ఎయిర్‌లైన్స్ బాంబే మరియు ఢిల్లీ నుంచే రాకపోకలను నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ నుంచి టర్కీలోని అతి పెద్ద నగరమైన ఇస్తాంబుల్‌కి రెండు విమానాలను నడుపుతున్న ఇండిగో.. 2023 జనవరి 1 నుంచి ముంబై-ఇస్తాంబుల్ సర్వీసును కూడా ప్రారంభించబోతోంది. దీనివల్ల.. ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్‌కి వెళ్లే రెండు సర్వీసుల్లో ఒకదాన్ని క్యాన్సిల్ చేసుకోబోతోంది.