Sound Alert System: సాధారణంగా వాహనాలు రోడ్లపై ప్రయాణిస్తుంటే ఇంజిన్ శబ్దం వలన హారన్ కొట్టకపోయినా గుర్తించడం ఈజీ. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీ, మోటార్ ఆధారంగా నడవడంతో శబ్దం రాదు. ఫలితంగా వెనక నుంచి వెహికిల్స్ వస్తున్నా పాదచారులు లేదా ఇతర వాహనదారులు గుర్తించడం చాలా కష్టం అవుతుంది. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు వెహికల్ అలర్ట్ సిస్టంను తప్పనిసరి చేసింది.
Read Also: Traffic Challan : చెప్పులు వేసుకొని బైక్ నడిపితే జరిమానా..?
ఇక, 2027 అక్టోబర్ 1వ తేదీ నుంచి అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు వెహికల్ అలర్ట్ సిస్టమ్ అమర్చడం తప్పనిసరి కానుంది. రోడ్డు భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వశాఖ పేర్కొనింది. 2026 అక్టోబర్ 1వ తేదీ తర్వాత తయారయ్యే అన్ని కొత్త ఎలక్ట్రిక్ ప్యాసింజర్, గూడ్స్ వాహనాలు AVAS సౌకర్యంతోనే రోడ్లపైకి రావాలని మంత్రిత్వశాఖ రిలీజ్ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా, వాహనాలు కదిలే సమయంలో ఈ సిస్టమ్ కృత్రిమ శబ్దాన్ని విడుదల చేస్తుంది. దీని వలన పాదచారులు, రోడ్డుపై ఉన్న ఇతర ప్రయాణికులు వాహనం వస్తోందని ముందుగానే గుర్తించే అవకాశం ఉంది. ఏఐఎస్-173 ప్రమాణాల ప్రకారం శబ్ద స్థాయిలతో ఈ సౌండ్ సిస్టమ్ ఉండాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుతం అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాలు ఇప్పటికే హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలకు AVAS వినియోగాన్ని తప్పనిసరి చేశాయి. అలాగే, భారత్‌లో కూడా ఈ నిబంధన అమల్లోకి రానుంది.
