NTV Telugu Site icon

RBI: మైక్రోసాఫ్ట్‌ సమస్యపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

Rbi

Rbi

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంపై భారతీయ రిజర్వు బ్యాంకు స్పందించింది. సాంకేతిక లోపం కారణంగా భారత్‌లోని 10 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సేవల్లో స్వల్ప అంతరాయం ఏర్పడినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. అయితే ఇది స్వల్ప అంతరాయమేనని, వాటిలో కొన్ని ఇప్పటికే పరిష్కరించినట్లు స్పష్టం చేసింది. చాలా బ్యాంకుల కీలక వ్యవస్థలు క్లౌడ్‌లో లేవని, కొన్ని బ్యాంకులు మాత్రమే క్రౌడ్‌ స్ట్రైక్‌ వినియోగిస్తున్నాయని ఆర్‌బీఐ తెలిపింది.

ఇది కూడా చదవండి: CM Chandrababu: వికసిత్ ఆంధ్రప్రదేశ్ పేరుతో 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు శ్రీకారం

మైక్రోసాఫ్ట్ అంతరాయం కారణంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విమానాలు, బ్యాంకులు, మీడియా సంస్థలు, ఆయా కంపెనీలకు అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్‌లు మరియు సేవలకు యాక్సెస్‌ను ప్రభావితం చేసే సమస్యను క్రమక్రమంగా పరిష్కరిస్తున్నట్లు టెక్నాలజీ కంపెనీ తెలిపింది.

ఇది కూడా చదవండి: CM Secretary: సీఎం చంద్రబాబు సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ రాజమౌళి